టాటా మోటార్స్ తన కొత్త సియారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్‌కు పరిచయ ధరలు రూ.18.79 లక్షల నుంచి రూ.24.79 లక్షల వరకు నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. సియారా ఎలక్ట్రిక్ వర్షన్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే మంగళవారమే ప్రారంభమైనట్లు వెల్లడించగా, జులై 15 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని టాటా మోటార్స్ తెలిపింది.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (టీఎంపీవీఎల్) ఎండీ, సీఈఓ శైలేష్ చంద్ర మాట్లాడుతూ భారత్‌లో విద్యుత్ వాహనాలపై డిమాండ్ వేగంగా పెరగడంలో పశ్చిమాసియా ప్రాంతంలోని ఉద్రిక్త పరిస్థితులు కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ఇంధన ధరల పెరుగుదల, సరఫరా సమస్యలపై ఉన్న ఆందోళనల వల్ల వినియోగదారుల్లో ఈవీలపై ఆసక్తి పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంధన సంక్షోభ భయాలు నెలకొన్న సమయంలో వినియోగదారులు ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపినట్లు ఆయన తెలిపారు. దీంతో ఈవీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని చెప్పారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహన విభాగంలో ఈవీల వాటా 7–8 శాతం స్థాయిలో ఉండవచ్చని, 2027–28 ఆర్థిక సంవత్సరానికి ఇది 10 శాతాన్ని మించుతుందని శైలేష్ చంద్ర అంచనా వేశారు. భారత్‌లో ఈవీ రంగం భవిష్యత్‌లో మరింత బలపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















