అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ఏర్పాట్లు ఇరాన్‌లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని రాజధాని టెహ్రాన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఇరాన్ మీడియా ప్రకారం, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఖమేనీ భౌతికకాయాన్ని ఆయన “అమరత్వం పొందిన ప్రదేశానికి” తరలించారు. అనంతరం ఫిబ్రవరి 28న హత్య జరిగిన ప్రదేశానికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం.
టెహ్రాన్‌లో జులై 4, 5 తేదీల్లో జరిగే అంతిమయాత్రకు సుమారు రెండు కోట్ల మంది హాజరవుతారని ఐఆర్‌జీసీ అంచనా వేస్తోంది. ఇప్పటికే నలుపు దుస్తుల్లో వచ్చిన వేలాది మంది మద్దతుదారులు నివాళులు అర్పించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
తొమ్మిదో తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అనంతరం ఆయన స్వస్థలం మషాద్‌లో ఖననం చేయనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా హోర్డింగ్‌లు, బ్యానర్లతో స్మరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఈ అంత్యక్రియలకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. భారత్ తరఫున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ హాజరుకానున్నట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















