అంతర్జాతీయ వైద్య సంస్థ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదికల ప్రకారం మటన్‌లోని అన్ని భాగాల్లో కొవ్వు ఒకేలా ఉండదని స్పష్టమవుతోంది. మనం ఎంచుకునే ముక్క ఆధారంగా కేలరీలు, సంతృప్త కొవ్వుల పరిమాణం మారుతుందని నిపుణులు చెబుతున్నారు. తప్పు భాగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మటన్‌లో ఎక్కువ కొవ్వు, కేలరీలు ఉండే భాగాలు రొమ్ము (Breast), పక్కటెముకలు (Ribs), మెడ (Neck). ఇవి వండిన తర్వాత చాలా రుచిగా, జ్యూసీగా ఉన్నప్పటికీ, అధికంగా తీసుకుంటే గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు ఈ భాగాలకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
మరోవైపు తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్ కావాలనుకునేవారు మేక వీపు భాగం, కాలు, తొడ ముక్కలను ఎంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ‘లీన్ మీట్’గా పిలుస్తారు. ఇవి కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడతాయి.
అధికంగా మటన్ తినడం వల్ల గుండెపోటు ప్రమాదం పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. సంతృప్త కొవ్వులు రక్తనాళాల్లో పేరుకుపోయి రక్తప్రసరణకు ఆటంకం కలిగించవచ్చు. అలాగే మటన్‌లోని ప్యూరిన్లు శరీరంలో యూరిక్ యాసిడ్‌గా మారి కీళ్ల నొప్పులు, గౌట్ వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 70–100 గ్రాములకంటే ఎక్కువ మటన్ తీసుకోవడం మంచిది కాదు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తీసుకోవడం ఉత్తమం. అలాగే డీప్ ఫ్రై కాకుండా తక్కువ నూనెతో కర్రీ లేదా సూప్ రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















