తమిళనాడులో సంచలనం సృష్టించిన శ్రీకాంత్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుమారుడి వల్ల తనకు ప్రమాదం ఉందని ఓ జ్యోతిష్కుడు చెప్పడంతో తండ్రే కన్న కొడుకును హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటన తేని జిల్లాలో చోటుచేసుకుంది.
తేని నగరంలోని ఎంజీఆర్ నగర్‌కు చెందిన వేందర్ బాలా (50) తమిళగ మక్కళ్ మున్నేట్ర కళగం పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆయన మొదటి భార్య రాజలక్ష్మి కుమారుడు శ్రీకాంత్ (20)తో ఆస్తి విషయంలో తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు.
2023 సెప్టెంబర్‌లో శ్రీకాంత్ అదృశ్యమయ్యాడు. తన కుమారుడు కనిపించడం లేదంటూ తల్లి రాజలక్ష్మి మదురై హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 2026 ఫిబ్రవరిలో ఈ కేసు దర్యాప్తును సీబీసీఐడీకి అప్పగించారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు శ్రీకాంత్ అదృశ్యం వెనుక ఉన్న అనుమానితులపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తేనికి చెందిన అలెక్స్ పాండియన్‌కు, శ్రీకాంత్‌కు మధ్య గతంలో విభేదాలు ఉన్నట్లు గుర్తించారు. అలెక్స్ పాండియన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
అలెక్స్ పాండియన్ ఇచ్చిన సమాచారంతో వేందర్ బాలా, ముల్లైనగర్‌కు చెందిన కరుప్పయ్య ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురూ కలిసి శ్రీకాంత్‌ను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి ముల్లైపెరియార్ నదిలో పడేసినట్లు విచారణలో తేలినట్లు అధికారులు వెల్లడించారు.
బుధవారం వేందర్ బాలాను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తాను ఓ జ్యోతిష్కుడి వద్ద జాతకం చూపించానని, కుమారుడి వల్ల తనకు ప్రమాదం ఉందని చెప్పడంతో భయపడ్డానని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. స్నేహితుడు కరుప్పయ్య సహాయంతో శ్రీకాంత్‌ను గొంతు నులిమి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని వెల్లడించారు.
ఈ కేసులో మరో నిందితుడు కరుప్పయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్య కేసుగా మొదలైన ఈ ఘటన చివరకు హత్య కేసుగా మారడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















