ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన భారీ వృక్షారోపణ కార్యక్రమం విజయవంతమైంది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35.2 కోట్ల మొక్కలను నాటినట్లు అధికారులు వెల్లడించారు. ముందుగా నిర్దేశించుకున్న 35 కోట్ల మొక్కల లక్ష్యాన్ని అధిగమించినట్లు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పిలుపులో భాగంగా, అలాగే ‘వృక్షారోపణ మహాయజ్ఞ 2026’ కార్యక్రమంలో భాగంగా ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోరఖ్‌పుర్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలోని తాల్ రింగ్ రోడ్ వద్ద ఆయన స్వయంగా మొక్కలు నాటారు.
రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్నోలోని లోక్ భవన్‌లో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మొక్కలు నాటగా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఝాన్సీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటడం అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఏఎంసీకి గిన్నిస్ రికార్డు
మరోవైపు గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) కూడా భారీ వృక్షారోపణతో ప్రపంచ రికార్డు సాధించింది. మియావాకీ పద్ధతిలో కేవలం ఒక్క గంటలోనే సుమారు 3.61 లక్షల మొక్కలను నాటి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది.
ఈ కార్యక్రమంలో 25 వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. రికార్డు సాధించిన ఏఎంసీకి, వాలంటీర్లకు, గాంధీనగర్ నియోజకవర్గ ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు.
మియావాకీ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటి వేగంగా అడవులను అభివృద్ధి చేయవచ్చని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















