వైద్య విద్యా ప్రవేశ పరీక్ష అయిన నీట్ (NEET) 2027 సంవత్సరం నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించే అవకాశాల నేపథ్యంలో విద్యార్థులను ముందుగానే సిద్ధం చేసేందుకు ప్రత్యేక డిజిటల్ పరిష్కారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీ చైతన్య అనుబంధ సంస్థ అయిన ఇన్ఫినిటీ లెర్న్, గ్లోబల్ టెక్నాలజీ సంస్థలు ఏసర్, ఇంటెల్‌తో కలిసి హైదరాబాద్‌లో ‘నీట్ రెడీ ల్యాప్‌టాప్’ను ఆవిష్కరించింది.
నీట్ పరీక్ష విధానంలో రాబోయే మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలపై అవగాహన, డిజిటల్ నైపుణ్యాలు పెంపొందించడమే ఈ ల్యాప్‌టాప్ ప్రధాన ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశంలో ఈ తరహా ప్రత్యేక ల్యాప్‌టాప్ ఆవిష్కరణ ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
ఈ ల్యాప్‌టాప్‌లో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక సదుపాయాలను అందించారు. శక్తిమంతమైన హార్డ్‌వేర్‌తో పాటు ఇన్ఫినిటీ లెర్న్ ప్రత్యేక యాప్, ఏఐ ఆధారిత మెంటార్ సేవలు, ఆన్‌లైన్ మాక్ టెస్టులు, ప్రాక్టీస్ పరీక్షలు, లైవ్ క్లాసులు, రికార్డెడ్ వీడియో పాఠాలు అందుబాటులో ఉంటాయని సంస్థ వివరించింది.
విద్యార్థుల అభ్యాస స్థాయి, పరీక్షల పనితీరును విశ్లేషించేందుకు ప్రత్యేక ఫీచర్లను కూడా ఇందులో పొందుపరిచినట్లు తెలిపింది. విద్యార్థులు ఏ అంశాల్లో మెరుగుపడాలి, ఏ విభాగాల్లో ఎక్కువ సాధన అవసరమో గుర్తించి తగిన సూచనలు అందించేలా ఏఐ ఆధారిత విశ్లేషణ వ్యవస్థను రూపొందించినట్లు వెల్లడించింది.
కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో వేగం, ఖచ్చితత్వం ఎంతో కీలకమని, అందుకు అవసరమైన సాధనను విద్యార్థులు ముందుగానే పొందేలా ఈ ల్యాప్‌టాప్ ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది. పరీక్షా వాతావరణాన్ని పోలిన విధంగా మాక్ టెస్టులు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపింది.
నీట్‌తో పాటు భవిష్యత్తులో డిజిటల్ ఆధారిత పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులను సన్నద్ధం చేయడంలో ఈ సాంకేతిక పరికరం సహాయపడుతుందని ఇన్ఫినిటీ లెర్న్ వెల్లడించింది. నాణ్యమైన విద్యను సాంకేతికతతో అనుసంధానం చేసి విద్యార్థులకు మెరుగైన అభ్యాస అనుభవాన్ని అందించడమే లక్ష్యమని పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















