జాతీయ అర్హత పరీక్ష (నీట్) నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అభ్యర్థుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను సురక్షితంగా భద్రపరచుకునేందుకు ప్రత్యేక డిజి లాకర్ వ్యవస్థను రూపొందిస్తోంది. ఈ వ్యవస్థ రూపకల్పన ప్రస్తుతం తుదిదశలో ఉందని ఎన్‌టీఏ వెల్లడించింది.
డిజి లాకర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యార్థులు తమ నీట్ ర్యాంక్ కార్డులను ఆన్‌లైన్‌లో భద్రపరచుకోవచ్చని, భవిష్యత్ అవసరాల కోసం ఎప్పుడైనా వాటిని పొందే అవకాశం ఉంటుందని తెలిపింది. ర్యాంక్ కార్డులు పోగొట్టుకోవడం లేదా దెబ్బతినడం వంటి సమస్యలకు ఈ విధానం పరిష్కారంగా నిలుస్తుందని పేర్కొంది.
ఈ విషయాన్ని ఎన్‌టీఏ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)కు తెలియజేసింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద 2020లో ఓ నీట్ విద్యార్థిని ర్యాంక్ కార్డు భద్రతకు సంబంధించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎన్‌టీఏ ఈ డిజి లాకర్ వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది.
ప్రస్తుతం విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను భౌతిక లేదా డిజిటల్ రూపంలో భద్రపరుచుకోవాల్సి వస్తోంది. అయితే కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే నీట్ అభ్యర్థులకు మరింత సులభతరమైన, సురక్షితమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
విద్యార్థుల ధ్రువపత్రాల భద్రత, డిజిటల్ ప్రాప్యతను మెరుగుపరచడంలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నట్లు ఎన్‌టీఏ అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో ఇతర పరీక్షలకు సంబంధించిన పత్రాల విషయంలోనూ ఇలాంటి డిజిటల్ సదుపాయాలను విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















