భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిత్ర ట్రైలర్‌ను గురువారం ఘనంగా విడుదల చేయాలని మేకర్స్ తొలుత నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
‘రామాయణ’ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో సినిమాను ప్రమోట్ చేసేందుకు, ప్రపంచ ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ట్రైలర్ విడుదలను వాయిదా వేసినట్లు వెల్లడించారు. త్వరలోనే ట్రైలర్ విడుదలకు సంబంధించిన కొత్త తేదీని ప్రకటిస్తామని చెప్పారు.
ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా రూపొందుతోందని నిర్మాత పేర్కొన్నారు. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో విజువల్స్, సాంకేతికతతో ‘రామాయణ’ను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ సినీ పరిశ్రమకు ఈ సినిమా గర్వకారణంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. భారీ తారాగణం, అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ చిత్రానికి సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చవుతున్నట్లు సమాచారం. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రణాళిక సిద్ధం చేసింది.
ట్రైలర్ వాయిదా పడటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. కొత్త ట్రైలర్ విడుదల తేదీ కోసం ప్రేక్షకులు, సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















