వ్యాఖ్యాతగా, నటిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఉదయభాను ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. దాదాపు 15 ఏళ్లుగా నిర్మాతగా మారాలనే కలతో ప్రయత్నాలు చేస్తున్న ఆమె.. చివరకు ‘పంచనామా’ సిరీస్‌తో ఆ కలను సాకారం చేసుకున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉదయభాను తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
తాను ఎమోషనల్ కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చినప్పటికీ.. భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోతున్నానని ఆమె తెలిపారు. నిర్మాతగా మారేందుకు 15 ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేశానని చెప్పారు. మంచి కథ, కంటెంట్ ఉందని పలువురిని కలిసినా ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదన్నారు. ‘వచ్చే నెల.. వచ్చే వారం ప్రారంభిద్దాం’ అంటూ ఏళ్ల తరబడి కాలం గడిచిపోయిందని గుర్తుచేసుకున్నారు. ఇన్నేళ్లు ఎందుకు ఆలస్యమైందనేది తనకూ సమాధానం లేని ప్రశ్నేనని చెప్పారు.
తన ప్రయాణం టెలివిజన్ నుంచే ప్రారంభమైందని, అందుకే అదే రంగం ద్వారా నిర్మాతగా అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఉదయభాను తెలిపారు. ఈ క్రమంలో ప్రశాంతంగా రెండు గంటలు కూడా నిద్రపోలేదని ఆమె చెప్పుకొచ్చారు. తన 15 ఏళ్ల కలకు జీ5 సంస్థ ప్రాణం పోసిందని, అందుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు.
తనకు ఎలాంటి సినీ నేపథ్యం లేదని ఉదయభాను స్పష్టం చేశారు. 12 ఏళ్ల వయసులోనే మైక్ పట్టుకుని స్వయంకృషితో ఒక్కో విషయం నేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చానన్నారు. తనకు స్టూడియోలు లేవని, తాను స్టార్ కుటుంబంలో పుట్టలేదని చెప్పారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రతి సారి ధైర్యంగా నిలబడి ముందుకు సాగానని తెలిపారు. కిందపడిన ప్రతిసారీ రెట్టింపు ఉత్సాహంతో పైకి లేచానని, ఇప్పుడు పరిగెత్తడం కూడా నేర్చుకున్నానని భావోద్వేగంగా చెప్పారు.
తన కెరీర్‌లో ప్రేక్షకులే అసలైన అండగా నిలిచారని ఉదయభాను పేర్కొన్నారు. తాను నిర్వహించిన కార్యక్రమాలకు, తన ప్రయాణానికి ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణే తనకు అతిపెద్ద బలమన్నారు. తన ప్రొడక్షన్ సంస్థలో ప్రతిభ ఉన్నవారికి ఎప్పుడూ అవకాశాల తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు.
‘పంచనామా’ సిరీస్ కోసం కొంతమంది హీరోలను సంప్రదించామని, అయితే వారిలో కొందరు అడిగిన పారితోషికం మొత్తం సిరీస్ బడ్జెట్‌కు సమానంగా ఉందని ఉదయభాను వెల్లడించారు. భరత్ నివాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ‘పంచనామా’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















