నటుడు జయం రవి భార్య ఆర్తి చేసిన తాజా ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన జీవితంలోకి వచ్చిన ఓ వ్యక్తి నటనకు ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వొచ్చంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్తి.. తాజాగా ఓ నోట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు.
‘‘సూర్య, అజిత్, విక్రమ్, కమల్ హాసన్.. వీళ్లందరి కంటే నా జీవితంలోకి వచ్చి ఒకరు నటించిన నటనకి ఆస్కార్ అవార్డు కూడా ఇచ్చేయొచ్చు’’ అంటూ ఆర్తి పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయాన్ని ఆమె స్పష్టంగా వెల్లడించలేదు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట చర్చకు దారితీసింది.
జయం రవి, ఆర్తి దంపతుల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాహ వివాదం నేపథ్యంలో ఆమె తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 2024లో తాము విడిపోతున్నట్లు జయం రవి ప్రకటించినప్పటి నుంచి ఇద్దరి మధ్య పలు సందర్భాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ వైవాహిక జీవితానికి సంబంధించి ఇరువురూ గతంలో సోషల్ మీడియా, మీడియా వేదికలపై స్పందించిన సందర్భాలు ఉన్నాయి.
ఇటీవల జయం రవి చేసిన కొన్ని వ్యాఖ్యలపై కూడా ఆర్తి స్పందించారు. విడాకులు పూర్తికాకముందే తాను మరో వ్యక్తితో కలిసి ఉంటే అది అసహ్యకరమైన ప్రవర్తనగా భావించేవారని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలకే ఎక్కువగా మద్దతు లభిస్తుందనే అభిప్రాయంపై కూడా ఆమె తన స్పందనను వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన ‘ఆస్కార్’ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించివోననే చర్చ మొదలైంది.
ఇదిలా ఉంటే.. జయం రవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘వడ్డీ కాసులవాడ’ చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో జయం రవి వెంకటేశ్వరస్వామి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మధ్యతరగతి కుటుంబాల జీవన విధానం, ఈఎంఐలు, వాయిదాలు, అప్పుల చుట్టూ సాగే పరిస్థితులను హాస్యభరితంగా చూపించే కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















