ఇరాన్‌తో అమెరికా కొనసాగిస్తున్న సుదీర్ఘ యుద్ధంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా టాప్ సైనిక అధికారి జనరల్ డాన్ కేన్ ట్రంప్ కార్యవర్గానికి కీలక సూచనలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘర్షణను ఇకనైనా ముగించే మార్గాలను అన్వేషించాలని, సైనిక చర్యలను మరింత తీవ్రతరం చేస్తే ప్రతికూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.
ఇరాన్‌తో యుద్ధం తొలుత స్వల్పకాలికంగానే ఉంటుందని భావించినప్పటికీ, ఇప్పటికే అది సుదీర్ఘ ఘర్షణగా మారిందని జనరల్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేవలం వైమానిక దాడులతో నిర్దేశిత లక్ష్యాలను పూర్తిగా సాధించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ అంశంపై పలువురు ఉన్నతాధికారులతోనూ డాన్ కేన్ చర్చించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు, ఇరాన్‌పై సుదీర్ఘంగా కొనసాగుతున్న వైమానిక దాడుల నేపథ్యంలో అమెరికా ఆయుధ నిల్వలపై కూడా చర్చ జరుగుతోంది. మిసైల్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్లు, పేట్రియాట్ క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు కొన్ని అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తమ వద్ద భారీగా ఆయుధ నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. రక్షణ రంగ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు భారీగా ప్లాంట్లు, ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















