శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్న టీమిండియాకు గాయాల సమస్య పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరంగా ఉండగా.. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య రికవరీ విషయంలోనూ తాజా సమాచారం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో భారత జట్టుకు సంబంధించిన ప్రస్తుత, భవిష్యత్ ఆటగాళ్లు కలిపి 13 మంది పునరావాస ప్రక్రియలో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
బుమ్రా ఎడమ మోకాలిలో వాపుతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. పునరావాసంలో భాగంగా జాగింగ్, ఒక కాలితో చేసే వ్యాయామాల సమయంలో అతడికి అసౌకర్యం ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు పూర్తిస్థాయిలో కోలుకుని మైదానంలోకి తిరిగి ఎప్పుడు వస్తాడనే దానిపై ఇప్పుడే స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. రికవరీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు హార్దిక్ పాండ్యకు కూడా రికవరీ సమయంలో మోకాలి నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పూర్తిస్థాయిలో బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత ఈ సమస్య తలెత్తింది. వైద్య పరీక్షల్లో తీవ్రమైన సమస్య ఏదీ కనిపించకపోయినా.. ముందుజాగ్రత్తగా పరుగెత్తడం, బౌలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. చికిత్సకు అతడు బాగానే స్పందిస్తున్నాడని, పరిస్థితిని బట్టి బౌలింగ్ భారాన్ని క్రమంగా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కూడా గాయం కావడం భారత జట్టుకు మరో ఎదురుదెబ్బగా మారింది. శ్రీలంక XIతో వార్మప్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో అతడి కుడి చేతి బొటన వేలికి గాయం అయింది. దీంతో వార్మప్ మ్యాచ్‌లో గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గిల్ రెండో రోజు బరిలోకి దిగుతాడని తొలుత భావించినప్పటికీ.. గాయం కారణంగా అతడు మ్యాచ్‌కు దూరమయ్యాడు.
ఇప్పటికే బుమ్రాతో పాటు హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి శ్రీలంక పర్యటనకు దూరమయ్యారు. వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్ ఫిట్‌నెస్‌పై కూడా అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు ఆటగాళ్ల ఫిట్‌నెస్ పెద్ద సవాలుగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















