దేశంలోని నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు సాంకేతికతతో పరిష్కారం చూపే దిశగా ఉత్తరాఖండ్‌కు చెందిన యువకుడు రవి తమ్తా వినూత్న ప్రయత్నం చేశారు. అల్మోరా జిల్లా కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన ఆయన హపిదా స్కైనెక్స్ పేరుతో సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్‌ను అభివృద్ధి చేశారు. తాజాగా అల్మోరాలోని ఓ మైదానంలో ఈ వాహనాన్ని విజయవంతంగా పరీక్షించారు.
పూర్తిగా విద్యుత్‌తో పనిచేసే ఈ వ్యక్తిగత ఫ్లయింగ్ వెహికల్ పర్యావరణహిత ప్రయాణానికి అనుకూలంగా ఉండేలా రూపొందించినట్లు తెలుస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా రవి తమ్తా చేసిన పరిశోధన, ప్రయోగాలకు ఈ విజయాన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. భవిష్యత్తులో వ్యక్తిగత రవాణా రంగంలో మరిన్ని వినూత్న మార్పులకు ఈ ప్రయత్నం దోహదపడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రవి తమ్తా హపిదా స్కై ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్‌ను స్థాపించి ఈ వాహనాన్ని అభివృద్ధి చేశారు. ఆయన ఆవిష్కరణకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా అభినందనలు తెలిపారు. దేశ యువతలో ప్రతిభ, సృజనాత్మకతకు ఈ ప్రయోగం నిదర్శనమని పేర్కొంటూ.. రవి తమ్తా ప్రయత్నం మరింత మంది యువ ఆవిష్కర్తలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews
















