పాకిస్థాన్‌లో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ముఖ్యంగా పెట్రోల్ ధరలు ప్రజలపై తీవ్ర భారాన్ని మోపుతున్నాయి. ధరల పెరుగుదలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేలాది మంది ప్రజలు దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పెట్రోల్‌పై ప్రభుత్వం విధించిన లెవీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జమాత్ ఏ ఇస్లామీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలు కరాచీ, లాహోర్, పెషావర్, క్వెట్టా, ఇస్లామాబాద్ సహా పలు ప్రధాన నగరాలకు విస్తరించాయి. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పెట్రోల్ లెవీ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని జమాత్ ఏ ఇస్లామీ చీఫ్ నయీముర్ రెహ్మాన్ స్పష్టం చేశారు. పెరుగుతున్న పన్నుల భారంతో ఇప్పటికే సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితికి గత, ప్రస్తుత ప్రభుత్వాల విధానాలే కారణమని విమర్శించారు.
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి పొందుతున్న రుణాలకు అనుగుణంగా పన్నుల పెంపు, పొదుపు చర్యలు, ప్రైవేటీకరణ వంటి సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ లెవీని తొలగించడం సాధ్యం కాదన్న ప్రభుత్వ వాదనను జమాత్ ఏ ఇస్లామీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
మార్చి నుంచి దాదాపు ప్రతి వారం పెట్రోల్ ధరలను పెంచుతూ వస్తున్న ప్రభుత్వం.. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో మరింత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ధరల భారంపై ప్రజల్లో అసంతృప్తి తీవ్రం కావడంతో నిరసనలు మరింత ఉద్ధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















