పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, భద్రతాపరమైన ముప్పుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియే నుంచి రహస్యంగా మరో విమానంలో ప్రయాణించినట్లు అమెరికా మీడియా కథనం వెల్లడించింది. శత్రువులకు ఆయన ప్రయాణ వివరాలు తెలియకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు కథనం పేర్కొంది.
జులైలో తుర్కియే రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు ట్రంప్ బోయింగ్ 747-8 విమానంలో వెళ్లారు. అయితే సదస్సు అనంతరం తిరుగు ప్రయాణంలో మాత్రం అదే విమానాన్ని ఉపయోగించలేదని సమాచారం. ఎయిర్‌ఫోర్స్ వన్‌లోనే ట్రంప్ ప్రయాణిస్తున్నట్లు బయటకు కనిపించేలా ఏర్పాట్లు చేసినప్పటికీ.. అనంతరం ఆయనను మరో విమానంలోకి మార్చినట్లు కథనం తెలిపింది.
అంకారా విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్న గ్రౌండ్ సపోర్ట్ వాహనం ద్వారా ట్రంప్‌ను విమానం నుంచి బయటకు తీసుకొచ్చి, అక్కడ సిద్ధంగా ఉన్న C-32A విమానంలోకి ఎక్కించినట్లు సమాచారం. అనంతరం ఆ విమానం తుర్కియే నుంచి బ్రిటన్ వైపు వెళ్లినట్లు అమెరికా మీడియా పేర్కొంది.
ఇదే సమయంలో ఎయిర్‌ఫోర్స్ వన్‌లో పాత్రికేయులు, ఇతర సిబ్బంది ప్రయాణించినట్లు తెలుస్తోంది. ట్రంప్ కూడా అదే విమానంలో ఉన్నారని శత్రువులు భావించేలా ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లు కథనం పేర్కొంది. ఈ ఘటన జులై 8న జరిగినట్లు సమాచారం.
ఆ సమయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉండటంతో ట్రంప్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ తుర్కియేకు సమీపంలో ఉండటంతో ప్రయాణ మార్గం, విమాన వివరాలను గోప్యంగా ఉంచేందుకు ఈ విధానం అనుసరించినట్లు కథనం పేర్కొంది.
అమెరికా అధ్యక్షుల అధికారిక ప్రయాణాలకు ఉపయోగించే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు అత్యంత పటిష్ఠంగా ఉంటాయి. అయినప్పటికీ అధ్యక్షుడి కదలికలను మరింత గోప్యంగా ఉంచేందుకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది.
ట్రంప్‌ను తరలించేందుకు ఉపయోగించిన క్యాటరింగ్ ట్రక్కులు సాధారణంగా విమానంలోకి ఆహారం, ఇతర సామగ్రి, సిబ్బందిని తరలించేందుకు వినియోగిస్తారు. అదే వాహనాన్ని ట్రంప్ మార్పిడికి ఉపయోగించినట్లు అమెరికా మీడియా కథనం పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















