అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువుల వేటకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు ఉత్కంఠను కలిగిస్తుంటాయి. తాజాగా చిరుతపులి వేటకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిరుత అడవి పందిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ముందుగా తల్లి పందిని దాని పిల్లలకు దూరంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన చిరుత.. సరైన అవకాశం కోసం వేచి చూసినట్లు కనిపించింది.
ఆ తర్వాత పిల్లలు ఉన్న గోతిలోకి చిరుత చాకచక్యంగా ప్రవేశించింది. ఒక్కసారిగా పంది పిల్లలపై దాడి చేసి వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఓ పంది పిల్ల చిరుత నుంచి తప్పించుకోగా.. మరో పిల్ల మాత్రం దాని బారిన పడింది.
చిరుత ఆ పంది పిల్లను నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. వేటలో చిరుత ప్రదర్శించిన వేగం, చాకచక్యం, సమయస్ఫూర్తి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన పలువురు ‘చిరుత వేట మామూలుగా లేదుగా!’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















