భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు ఆరంభంలోనే వరుస వికెట్లు తీస్తూ మ్యాచ్‌పై పట్టు బిగించారు.
నిషాన్ మదుశంక 6 పరుగులు చేయగా మహ్మద్ సిరాజ్ అతడిని ఔట్ చేశాడు. అనంతరం మానవ్ సుతార్ బౌలింగ్‌లో పసిందు సూర్యబండార తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కమిందు మెండిస్ 2 పరుగులు చేయగా ప్రసిద్ధ్ కృష్ణ అతడిని పెవిలియన్‌కు పంపాడు.
12 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక స్కోరు 23/3గా ఉంది. లాహిరు ఉదార 13 పరుగులతో, ధనుంజయ డి సిల్వా పరుగులేమీ లేకుండా క్రీజులో ఉన్నారు.
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 193 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 178 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని భారత్ మొత్తం 371 పరుగుల ఆధిక్యం సాధించింది. దీంతో శ్రీలంక ముందు 372 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















