హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ రాకెట్‌ను ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు ప్రధాన డ్రగ్స్ సరఫరాదారులను అరెస్టు చేయడంతో పాటు, వారి వద్ద నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేస్తున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
నిందితుల నుంచి సుమారు రూ.16.40 లక్షల విలువైన 95.41 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 11న వట్టినాగులపల్లి కింగ్‌డమ్ పబ్ రోడ్డు వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న యశ్వంత్ సాయి షణ్ముఖ్ అనే పెడ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా డ్రగ్స్ సరఫరాకు బెంగళూరు, కేరళలో మూలాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం లభించింది.
దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఆగస్టు 18న కేరళలోని త్రిస్సూర్‌లో మహమ్మద్ రజల్ అబ్దుల్ గఫూర్‌ను అరెస్టు చేశారు. విచారణలో ఓ నైజీరియన్ వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు అతడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
అదే సమయంలో బెంగళూరులో నవీన అనే మహిళా పెడ్లర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా భారీగా మాదకద్రవ్యాలు లభించినట్లు తెలిపారు. విచారణలో కేరళలో నివసించే తన స్నేహితుడు అనేశ్వర్ ద్వారా డ్రగ్స్ సేకరించి విక్రయిస్తున్నట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పట్టుబడిన నిందితులపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? మాదకద్రవ్యాల సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















