ముగ్గురు విద్యుత్తు పనులు చేసే కార్మికులు కాలువలోకి దిగడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కాళ్లు, ముఖం శుభ్రం చేసుకునేందుకు రేవులోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ క్రమంలో ఇద్దరు ఒడ్డుకు చేరుకోగా.. మరో వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుడి సమయస్ఫూర్తితో ఇద్దరి ప్రాణాలు దక్కాయి.
పెరవలి మండలం ముక్కామలలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ముక్కామలకు చెందిన పెట్టా నాగరాజు, పెద్దిరెడ్డి శివప్రసాద్, కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన యాడిద శ్రీరవితేజ విద్యుత్తు పనులు చేస్తుంటారు. శివప్రసాద్, శ్రీరవితేజ గతంలో విజయవాడలో కలిసి పనిచేశారు. మళ్లీ అక్కడికి వెళ్లి పనులు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో శ్రీరవితేజ సోమవారం రాత్రి తన స్వగ్రామం నుంచి ముక్కామలకు చేరుకున్నారు.
మంగళవారం ఉదయం ముగ్గురూ కాలువ వద్దకు వెళ్లారు. కాళ్లు, ముఖం శుభ్రం చేసుకునేందుకు కాలువలోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి ప్రవాహంలో పడిపోయారు. ముగ్గురూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా అటుగా వెళ్తున్న స్థానికుడు బొచ్చు సతీష్ గమనించాడు. వెంటనే స్పందించి లంకలో గడ్డి కట్టుకునేందుకు ఉపయోగించే సైకిల్ ట్యూబ్‌ను నాగరాజుకు అందించాడు.
ట్యూబ్ సాయంతో నాగరాజు ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం శివప్రసాద్‌ను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే శ్రీరవితేజను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. సతీష్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా.. మరో వ్యక్తి ఆచూకీ లభించకపోవడం కుటుంబసభ్యుల్లో ఆందోళన కలిగించింది.
సమాచారం అందుకున్న ఎస్సై అలెంగ్జాండర్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. గల్లంతైన శ్రీరవితేజ కోసం పోలీసులు, స్థానికులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత ప్రయత్నించినా ఆచూకీ లభించకపోవడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సాయం తీసుకోవాలని తహసీల్దార్‌కు పోలీసులు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















