ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన తర్వాత రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొందరికి రిటర్న్ ప్రాసెస్ అయిన వెంటనే రిఫండ్ అందుతున్నప్పటికీ.. మరికొందరి విషయంలో వారాలు గడిచినా స్టేటస్ ‘అండర్ ప్రాసెస్’గానే కనిపిస్తోంది. అయితే రిఫండ్ ఆలస్యం కావడానికి పలు కారణాలు ఉండొచ్చు.
రిఫండ్ ఆలస్యం కావడానికి కారణాలేంటి?
ఇ-వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం:
ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత ఇ-వెరిఫికేషన్ పూర్తి చేయడం తప్పనిసరి. సాధారణంగా రిటర్న్ దాఖలు చేసిన తేదీ నుంచి 30 రోజుల్లోగా ఇ-వెరిఫికేషన్ చేయాలి. ఇది పూర్తికాకపోతే రిటర్న్ ప్రాసెసింగ్‌లో జాప్యం ఏర్పడొచ్చు.
బ్యాంక్ ఖాతా ప్రీ-వ్యాలిడేషన్ లేకపోవడం:
రిఫండ్ పొందేందుకు ఐటీఆర్‌లో పేర్కొన్న బ్యాంక్ ఖాతా సరైన విధంగా ప్రీ-వ్యాలిడేట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఖాతా వ్యాలిడేషన్‌లో సమస్య ఉంటే రిఫండ్ జారీ ఆలస్యం కావచ్చు.
బ్యాంక్ వివరాల్లో వ్యత్యాసాలు:
బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరు, పాన్ వివరాల్లో ఉన్న పేరుకు సరిపోలకపోవడం, ఐటీఆర్‌లో పేర్కొన్న ఖాతా మూసివేయడం లేదా తప్పు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఇవ్వడం వంటి కారణాలతో కూడా రిఫండ్ నిలిచిపోవచ్చు.
పాన్-ఆధార్ లింక్ కాకపోవడం:
పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయకపోయినా కొన్ని సందర్భాల్లో రిఫండ్ ప్రక్రియలో సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సందర్భాల్లో పోర్టల్‌లో సంబంధిత ఎర్రర్ లేదా సూచన కనిపించవచ్చు.
ఐటీఆర్‌లో వివరాల పొరపాట్లు:
ఆదాయం, వడ్డీ, టీడీఎస్ వంటి వివరాలను తప్పుగా నమోదు చేయడం లేదా అందుబాటులో ఉన్న ఏఐఎస్, ఫారం 26ఏఎస్, టీడీఎస్ సర్టిఫికెట్ల వివరాలతో సరిపోలకపోవడం వల్ల రిటర్న్ ప్రాసెసింగ్ ఆలస్యం కావచ్చు.
అదనపు తనిఖీలు:
పెద్ద మొత్తంలో రిఫండ్ క్లెయిమ్ చేసినప్పుడు ఆదాయపు పన్ను విభాగం అదనపు పరిశీలనలు నిర్వహించే అవకాశం ఉంటుంది. కొన్ని రిటర్నులను రిస్క్ ఆధారిత ధ్రువీకరణకు పంపవచ్చు. దీంతో సాధారణ రిటర్న్లతో పోలిస్తే రిఫండ్ జారీకి ఎక్కువ సమయం పట్టొచ్చు.
రిఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
రిఫండ్ స్థితిని ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్‌లో సులభంగా తెలుసుకోవచ్చు.
- **Income Tax e-Filing Portal**లోకి వెళ్లి పాన్, పాస్‌వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వాలి.
- టాప్ మెనూలో e-File విభాగాన్ని ఎంచుకోవాలి.
- Income Tax Returns → View Filed Returnsలోకి వెళ్లాలి.
- సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌ను ఎంచుకుంటే రిటర్న్, ప్రాసెసింగ్, రిఫండ్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.
అక్కడ రిటర్న్ ఎప్పుడు దాఖలు చేశారు, ఇ-వెరిఫికేషన్ ఎప్పుడు పూర్తయింది, రిటర్న్ ప్రాసెస్ అయిందా, రిఫండ్ జారీ అయిందా వంటి వివరాలను పరిశీలించవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















