దాదాపు తొమ్మిది దశాబ్దాల సినీ చరిత్ర ఉన్న అక్కినేని కుటుంబం నుంచి మూడు తరాలు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేశాయి. ఈ వారసత్వం, సినిమాలపై ప్రేమ, కుటుంబ అనుబంధం వంటి అంశాలపై నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సినిమా పట్ల తనకు ఉన్న క్రమశిక్షణ, అభిరుచిని తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) నుంచి నేర్చుకున్నానని నాగార్జున తెలిపారు. అదే లక్షణాలు ఇప్పుడు తన పిల్లల్లోనూ కనిపిస్తున్నాయని చెప్పారు. వారసత్వం అంటే కేవలం నటించడం మాత్రమే కాదని.. సినిమాకు సేవ చేయడం కూడా అందులో భాగమేనని పేర్కొన్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనదని నాగార్జున వివరించారు. చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే ఎంతోమంది కలలకు అది వేదికగా నిలుస్తోందని, వారి కలలకు ప్రాణం పోయడమే తమ వారసత్వంలో భాగమని అన్నారు.
‘హలో బ్రదర్’నే ఎంచుకున్న చైతూ, అఖిల్:
తమ తండ్రి నటించిన సినిమాల్లో ఏదైనా ఒకదానికి ఆడిషన్ ఇచ్చే అవకాశం వస్తే ఏ చిత్రాన్ని ఎంచుకుంటారని అడిగినప్పుడు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ వెంటనే ‘హలో బ్రదర్’ పేరును చెప్పడం విశేషం.అఖిల్ తాను ‘హలో బ్రదర్’ సినిమాను వందసార్లకు పైగా చూసినట్లు చెప్పారు. నాగచైతన్య మాత్రం ‘గీతాంజలి’, ‘మన్మథుడు’ వంటి ప్రేమకథా చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. దీనిపై నాగార్జున సరదాగా స్పందిస్తూ.. తన పిల్లలు ‘హలో బ్రదర్’ సినిమాను వీహెచ్‌ఎస్ క్యాసెట్ అరిగిపోయేంతగా చూసేవారని గుర్తుచేసుకున్నారు.
నాన్న స్టార్‌డమ్ అప్పుడు అర్థమైంది..
తండ్రి గురించి తొలి జ్ఞాపకం ఏంటని ప్రశ్నించగా నాగచైతన్య తన చిన్ననాటి అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. చెన్నైలో ఉన్నప్పుడు తండ్రి సినిమాలను ఎక్కువగా క్యాసెట్లలో చూసేవాడినని చెప్పారు. అయితే నాగార్జున నటించిన ‘మాస్’ చిత్రాన్ని హైదరాబాద్‌లోని సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూశానని తెలిపారు.
ఆ సమయంలో థియేటర్‌లో అభిమానుల సందడి చూసి.. తన తండ్రిపై ప్రేక్షకులకు ఉన్న ప్రేమ, అభిమానం ఏంటో తొలిసారి అర్థమైందని చైతన్య పేర్కొన్నారు.అఖిల్ కూడా చిన్నతనంలో తండ్రి సినిమాలకు ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్లేందుకు ప్రయత్నించేవాడినని చెప్పారు. ఆడియో వేడుకలకు వెళ్లినప్పుడు వేలాది మంది అభిమానుల అరుపులు చూసినప్పుడే నాగార్జున స్టార్‌డమ్ స్థాయి తనకు అర్థమైందని తెలిపారు.
‘ఆ భారం ఎంతో పెద్దది’ :
అక్కినేని వారసత్వాన్ని కొనసాగించడంపై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఎన్నార్ దాదాపు 250 సినిమాలు చేసిన తర్వాత తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చానని, తన తొలి సినిమా కూడా తండ్రి 251వ సినిమా తరహాలో ఉండాలని ప్రేక్షకులు ఆశించారని చెప్పారు.తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి 25-30 సినిమాల సమయం పట్టిందని నాగార్జున తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో పరిస్థితులు మరింత సవాల్‌గా మారాయని అన్నారు. తన పిల్లలు తన వారసత్వంతో పాటు ఏఎన్నార్ వారసత్వాన్ని కూడా మోస్తున్నారని.. ఆ భారం ఎంతో పెద్దదని పేర్కొన్నారు.
కుటుంబంతో ఉన్నప్పుడు సినిమాల గురించి మాట్లాడరు :
పని, కుటుంబ జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకుంటారనే ప్రశ్నకు అఖిల్ ఆసక్తికరంగా స్పందించారు. పనిని ఇంటి బయటే ఉంచడం తన తండ్రి నాగార్జున, తాతయ్య ఏఎన్నార్ నుంచి నేర్చుకున్నామని చెప్పారు.
భోజనం చేసేటప్పుడు, సెలవులకు వెళ్లినప్పుడు సినిమాల గురించి అసలు మాట్లాడుకోమని అఖిల్ తెలిపారు. కుటుంబంతో గడిపే ఆ సమయం తమకు ఎంతో ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుందని చెప్పారు.చివరగా తన పిల్లలకు నాగార్జున ఓ కీలక సూచన చేశారు. ప్యాషన్, క్రమశిక్షణను ఎప్పటికీ కోల్పోవద్దని, తమ మూలాలను మరచిపోకూడదని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















