పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ను వైద్య పరీక్షలు, చికిత్స కోసం భారీ భద్రత నడుమ ఆస్పత్రికి తరలించారు. అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కు అధికారులు ఆయనను తీసుకెళ్లారు. అధిక రక్తపోటు, గుండె, కళ్లకు సంబంధించిన పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం ఇమ్రాన్‌ఖాన్‌ను తిరిగి అడియాలా జైలుకు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన చికిత్స కోసం అవసరమైతే విదేశాలకు తరలించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌ను ఆస్పత్రిలోనే ఉంచి వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందించాలని ఆయన కుటుంబసభ్యులు, మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. జైలులో ఉండటం వల్ల ఆయనకు అవసరమైన వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఖైదీలకు సాధారణంగా జైలులోనే వైద్య చికిత్స అందిస్తారని పాకిస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిఖ్ ఫజల్ చౌధరి తెలిపారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించే అవకాశం ఉంటుందని చెప్పారు.
అయితే ఇమ్రాన్‌ఖాన్ విషయంలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇతర ఖైదీలకు కూడా వర్తిస్తాయా? అనే అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు మంత్రి వెల్లడించారు. కొన్నేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌ఖాన్ ఇటీవల అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఆయనకు మెరుగైన వైద్యం అందించాలనే డిమాండ్లు పెరిగాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















