విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరేళ్ల బాలుడి మృతి తీవ్ర కలకలం రేపింది. హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఉపాధ్యాయురాలు మందలించి, చెంపపై కొట్టిన అనంతరం బాలుడు ఒక్కసారిగా కుప్పకూలినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తరగతిలో హోంవర్క్ పరిశీలిస్తున్న సమయంలో ప్రణయ్‌తేజ్ ఆందోళనకు గురైనట్లు సమాచారం. టీచర్ దగ్గరకు పిలిచి మందలించడంతో పాటు టై, బెల్టు సడలించి, చొక్కా గుండీలు విప్పి, చెంపపై కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం బాలుడు ఉపాధ్యాయురాలి ఒడిలోనే కుప్పకూలినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాలుడు స్పృహ కోల్పోవడంతో పాఠశాల సిబ్బంది వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం కేజీహెచ్‌కు తరలించగా అక్కడ కూడా వైద్యులు మృతిని నిర్ధారించారు. బాలుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. విద్యాశాఖ కూడా ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. విశాఖపట్నం జేడీ, డీఈవో, ఆర్డీవో ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ప్రణయ్‌తేజ్ మృతిపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పాఠశాల యాజమాన్యం, ఘటనకు బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















