రాష్ట్రంలో తాగునీటి సమస్య క్రమంగా తీవ్రతరం అవుతోంది. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలమట్టాలు పడిపోవడం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నిల్వలు తగ్గిపోవడంతో పలు పట్టణాలు, గ్రామాల్లో నీటి సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా 11 పట్టణాలు, 2,942 గ్రామాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం 207 గ్రామాల్లో బోర్లు పనిచేయకపోవడంతో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మరో 99 గ్రామాల్లో నీటి సరఫరా మెరుగుపరిచేందుకు రూ.81.57 లక్షలతో పనులు చేపడుతున్నారు. పట్టణాల్లోనూ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. గుత్తి, ఒంగోలు, పలమనేరు, పొదిలి, రాయచోటి, బేతంచెర్లలో మూడు నుంచి నాలుగు రోజులకోసారి నీటిని అందిస్తున్నారు.
రాయలసీమలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మదనపల్లెలో బోర్లు అడుగంటడంతో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. చిత్తూరు పరిధిలో జలాశయాలు, ఇన్‌ఫిల్ట్రేషన్ బావులు ఎండిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
ఇదిలా ఉండగా, తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం రూ.1,158.45 కోట్ల విలువైన పనులను మంజూరు చేసింది. వీటి ద్వారా రోజుకు అదనంగా 106.99 మిలియన్ లీటర్ల నీరు అందుబాటులోకి వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















