ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదన్న ఆగ్రహంతో వారిని హత్య చేసిన యువతి.. బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులను హత్య చేశానన్న పశ్చాత్తాపం, ప్రియుడు దూరం కావడం, బంధువుల ఆదరణ లేకపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆమె.. సంగారెడ్డిలోని వసతిగృహంలో ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారానికి చెందిన దశరథం, లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. వారి మూడో కుమార్తె సురేఖ(25) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలానికి చెందిన ఓ డ్రైవర్‌ను ఆమె ప్రేమించింది. అయితే అతడితో వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఈ ఏడాది జనవరి 28న వారికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
తొలుత వారిది సహజ మరణమని నమ్మించేందుకు ప్రయత్నించినప్పటికీ.. విచారణలో సురేఖ నేరాన్ని అంగీకరించిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. జులై 31న బెయిల్‌పై విడుదలైన అనంతరం ఆమె సోదరుడు సంగారెడ్డిలోని ఓ వసతిగృహంలో చేర్పించాడు.
అయితే తల్లిదండ్రుల హత్యపై పశ్చాత్తాపం, ప్రియుడు దూరం కావడం, బంధువులు తనతో మాట్లాడకపోవడం వంటి కారణాలతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వసతిగృహంలోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
ఆత్మహత్యకు ముందు సురేఖ ఆంగ్లంలో లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘నాకు చాలాకాలం బతకాలని, జీవితాన్ని ఆస్వాదించాలని ఉండేది. కానీ దేవుడు ఆ రాత రాయలేదు. ఇప్పుడు బతకాలనే ఆశ లేదు. నా చావుకు ఎవరూ కారణం కాదు. అన్నా.. రాఖీ కట్టలేకపోతున్నా. నన్ను క్షమించు’’ అని అందులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















