తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకుని, 100కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైన సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నటుడిగా, నిర్మాతగా సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన సినీ ప్రయాణం, ఎదుర్కొన్న కష్టాలు, స్నేహితులైన రజనీకాంత్, చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సినిమాల్లోకి వచ్చిన సమయంలో డబ్బుపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదని జీవీ నారాయణ చెప్పేవారు. నాటకాలు వేసే రోజుల్లో రూ.5 వేల సంపాదన కూడా పెద్ద మొత్తంగా భావించేవాడినని గుర్తుచేసుకున్నారు. ‘అంతులేని కథ’ చిత్రానికి తనకు, రజనీకాంత్‌కు కలిపి రూ.2 వేల పారితోషికం ఇచ్చారని, అందులో రూ.100 అడ్వాన్స్‌గా అందిందని తెలిపారు. ఆ డబ్బును ఎంతో ప్రత్యేకంగా భావించి గుడిలో పూజ చేయించుకున్నామని చెప్పారు. ఆ రూ.100తోనే తమ సినీ ప్రయాణం మొదలైందని గుర్తుచేసుకున్నారు.
ఒక సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా దానిని తలచుకుని బాధపడకుండా, ఆ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నానని ఆయన చెప్పారు. తర్వాత సినిమాల్లో హీరోయిన్ ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించినట్లు వెల్లడించారు. ఎన్నో సినిమాలు నిర్మించినప్పటికీ డబ్బు సంపాదించడంపై ఎప్పుడూ అత్యాశ చూపలేదని, ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవడమే తనకు ముఖ్యమని పేర్కొన్నారు.
రజనీకాంత్‌తో తనకున్న స్నేహాన్ని కూడా జీవీ నారాయణ పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు. బస్ కండెక్టర్‌గా పనిచేస్తున్న రజనీ నటనపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నారని తెలిపారు. ఆ సమయంలో రజనీకాంత్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తమ ఇంట్లో భోజనం చేసి వెళ్లేటప్పుడు ఖర్చుల కోసం రెండు రూపాయలు అడిగి తీసుకునేవారని చెప్పారు.
అలాగే చిరంజీవి గురించి కూడా జీవీ నారాయణ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిరంజీవిని హీరోగా నిలబెట్టడంలో ఆయన తండ్రి ప్రోత్సాహం ఎంతో ఉందని పేర్కొన్నారు. చిరంజీవికి ఇతరులకు సాయం చేసే గుణం ఎక్కువని, సినిమా 100 రోజుల వేడుకల సందర్భంగా కూడా ఎంతోమంది రైతులకు సహాయం చేశారని గుర్తుచేశారు. ఆయన చేసిన ఎన్నో మంచి పనులు బయట ప్రపంచానికి తెలియవని జీవీ నారాయణ చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి గుర్తుకొస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















