దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ప్రారంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ షేర్లలో అమ్మకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ క్రితం ముగింపు 77,656.09తో పోలిస్తే 77,892.10 వద్ద లాభాలతో ప్రారంభమైంది. అయితే లాభాలు క్రమంగా తగ్గి నష్టాల్లోకి జారుకుంది. చివరకు 183.15 పాయింట్లు కోల్పోయి 77,472.94 వద్ద ముగిసింది.ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 126.80 పాయింట్లు నష్టపోయి 24,207.75 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 24,378.60 వద్ద గరిష్ఠాన్ని, 24,207.75 వద్ద కనిష్ఠాన్ని తాకింది.
సెన్సెక్స్ 30 షేర్లలో 13 లాభాల్లో ముగియగా.. 17 నష్టాల్లో స్థిరపడ్డాయి. ఇన్ఫోసిస్ 1.94%, భారతీ ఎయిర్‌టెల్ 1.91%, ఎల్‌అండ్‌టీ 1.76%, టెక్ మహీంద్రా 1.38%, ఎన్‌టీపీసీ 1.29%, మహీంద్రా అండ్ మహీంద్రా 1.18%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.04% చొప్పున నష్టపోయాయి.
మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.53%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.87%, యాక్సిస్ బ్యాంక్ 1.33%, టాటా స్టీల్ 1.10% లాభపడ్డాయి.బీఎస్‌ఈ రంగాల సూచీల్లో టెలికాం, ఐటీ, యుటిలిటీస్, విద్యుత్, స్థిరాస్తి రంగాలు నష్టపోగా.. లోహాలు, కమొడిటీస్, బ్యాంకింగ్, గృహ రుణ రంగాలు లాభాల్లో ముగిశాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.502.63 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు మాత్రం రూ.6,425.16 కోట్ల కొనుగోళ్లు జరిపారు.బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.56,000 కోట్లు పెరిగి రూ.493.79 లక్షల కోట్లకు చేరింది.
స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ ఐపీఓకు ముగిసే సమయానికి ఐదు రెట్ల స్పందన లభించింది. 2,95,83,600 షేర్లకు గాను 15,02,61,400 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటెయిల్ విభాగంలో 6.91 రెట్లు, ఎన్‌ఐఐల విభాగంలో 6.90 రెట్లు స్పందన వచ్చింది.
హై-టెక్ ఇంజినీర్స్ ఐపీఓకు ఏకంగా 50.80 రెట్ల స్పందన నమోదైంది. ఎన్‌ఐఐ విభాగంలో 82.07 రెట్లు, రిటెయిల్ విభాగంలో 64.54 రెట్లు స్పందన లభించింది.సింబయోటెక్ ఫార్మాల్యాబ్ ఐపీఓకు ఐదు రెట్ల స్పందన కనిపించగా.. రిటెయిల్ విభాగంలో 5.05 రెట్ల బిడ్లు వచ్చాయి.
బ్రెంట్ ముడి చమురు ధర 1.16 శాతం తగ్గి బ్యారెల్‌కు 87.49 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సింగపూర్ మినహా మిగిలిన మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.
ఈద్-ఇ-మిలాద్ సందర్భంగా బుధవారం భారత విదేశీ మారకద్రవ్య మార్కెట్లు పనిచేయలేదు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















