మనుషులకే కాదు.. దేవుళ్లకూ రక్షాబంధన్ వేడుకలు నిర్వహించే సంప్రదాయం ఉంది. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో ఈ వేడుకకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గమ్హా పూర్ణిమ సందర్భంగా ఏటా సోదరి సుభద్ర.. తన అన్నలు జగన్నాథుడు, బలభద్రులకు రాఖీలు కట్టడం ఆనవాయితీ.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేడుకల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీలను సిద్ధం చేశారు. పూరీలోని పట్టారా కళాకారులు సంప్రదాయ పద్ధతిలో బసుంగా పట్టు దారాలను ఉపయోగించి ఈ భారీ రాఖీలను తయారు చేశారు. పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులను ఉపయోగిస్తూ వాటిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
రక్షాబంధన్ సందర్భంగా జగన్నాథుడు, బలభద్రులకు ఈ ప్రత్యేక రాఖీలను అలంకరించనున్నారు. భక్తి, సంప్రదాయం, కళాత్మకత కలగలిపిన ఈ భారీ రాఖీలు పూరీ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















