పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా వైద్య కళాశాల ఆసుపత్రిలో నవజాత శిశువుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఆగస్టు నెల ప్రారంభం నుంచి మూడు వారాల వ్యవధిలో ఏకంగా 60 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. రెండో వారంలో ఒకేరోజు 10 మంది చిన్నారులు మృతి చెందడం మరింత ఆందోళనకు దారితీసింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది.
మృతిచెందిన 60 మంది చిన్నారుల్లో 44 మంది తొలుత వివిధ ఆసుపత్రుల్లో అనారోగ్య కారణాలతో చికిత్స పొందినట్లు అధికారులు తెలిపారు. వారి పరిస్థితి మెరుగుపడకపోవడంతో మాల్డా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు మరణించినట్లు వెల్లడించారు.
ఒకేరోజు మృతిచెందిన 10 మంది చిన్నారుల్లో ఇద్దరు మాల్డా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోనే జన్మించగా.. మిగిలిన ఎనిమిది మంది ఇతర ఆసుపత్రుల్లో జన్మించినట్లు అధికారులు తెలిపారు. దీంతో మాల్డా ఆసుపత్రితో పాటు చిన్నారులను తొలుత చేర్చుకున్న ఇతర ఆసుపత్రుల్లోని వైద్య సదుపాయాలు, నిర్వహణ తీరుపైనా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఈ మరణాలకు సంబంధించి ప్రభుత్వానికి అందిన ప్రాథమిక నివేదికల్లో పలు కారణాలను పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలు, కామెర్లు, పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత సమస్యలు వంటి కారణాలతో చిన్నారులు మృతిచెందినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు వెల్లడించారు. అయితే వరుసగా ఇంతమంది నవజాత శిశువులు మృతిచెందడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















