కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కరశాస్త్రి కుటుంబం కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్లి నేపాల్ వరదల కారణంగా చైనాలోని డార్చింగ్ ప్రాంతంలో చిక్కుకుంది. భారీ వరదలకు రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో భారత్‌కు ఎలా తిరిగి రావాలో తెలియక వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
భాస్కరశాస్త్రి కుటుంబ సభ్యులు చిక్కుకున్న విషయం వారి బంధువులు ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది. కుటుంబాన్ని సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని వారు ఎమ్మెల్యేను కోరారు.
భాస్కరశాస్త్రి, ఆయన సతీమణి శారద, కుమారుడు రఘునాథశాస్త్రి, కోడలు హన్సిక ఈ నెల 10న బెంగళూరు నుంచి కైలాస మానసరోవర్ యాత్రకు బయలుదేరారు. మొత్తం 156 మంది బృందం తొలుత నేపాల్‌కు చేరుకుంది. వివిధ ప్రాంతాలను సందర్శించిన అనంతరం ఈ నెల 25న మానసరోవర్ యాత్రను ముగించింది.
అనంతరం పరిక్రమ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకోగా.. బృందంలోని 16 మంది అస్వస్థతకు గురికావడంతో వారు పరిక్రమకు వెళ్లలేదు. ప్రస్తుతం చైనాలోని డార్చింగ్‌లోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. ఈ ప్రాంతం నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉంది.
వీరు సెప్టెంబరు 1న కఠ్‌మాండూ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణ విమాన టికెట్లు ఇప్పటికే బుక్ చేసుకున్నారు. అయితే డార్చింగ్ నుంచి కఠ్‌మాండూ వెళ్లే మార్గం వరదలకు కొట్టుకుపోయిందని తెలియడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్ రామారావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్లిన 31 మంది యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు ఆ ట్రస్ట్ ఛైర్మన్ పోలాప్రగడ శ్రీనివాస్ తెలిపారు.
బుధవారం నేపాల్‌లో మెరుపు వరదలు సంభవించిన నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. యాత్రికులంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు.
నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణవాసులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దిల్లీలోని తెలంగాణభవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.
సాయం కోరేవారు బాధితుల పేరు, పాస్‌పోర్టు వివరాలు, మొబైల్ నంబర్, నేపాల్‌లో చివరిగా ఉన్న ప్రదేశం, పర్యాటక సంస్థ వివరాలను హెల్ప్‌లైన్ ప్రతినిధులకు అందించాలని సూచించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















