టీ20 క్రికెట్‌లో అప్పుడప్పుడూ అరుదైన రికార్డులు నమోదవుతుంటాయి. తాజాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్-2026లో జరిగిన ఓ మ్యాచ్ ఇలాంటి రెండు అరుదైన ఘనతలకు వేదికైంది. ఒకవైపు తొలి ఓవర్‌లోని మొదటి మూడు బంతులకే హ్యాట్రిక్ నమోదవగా.. మరోవైపు ఒకే జట్టుకు చెందిన ఐదుగురు బ్యాటర్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. తిరుచ్చి గ్రాండ్ చోళాస్, విదా కోవై కింగ్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
టాస్ గెలిచిన విదా కోవై కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తిరుచ్చి గ్రాండ్ చోళాస్.. విదా పేసర్ దీబన్ లింగేశ్ ధాటికి 99 పరుగులకే కుప్పకూలింది.
తొలి ఓవర్ వేసిన లింగేశ్.. మొదటి మూడు బంతులకే వరుసగా మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. భారత టీ20 క్రికెట్‌లో తొలి మూడు బంతులకే హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్‌గా లింగేశ్ రికార్డు సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే తిరుచ్చి ఓపెనర్ రాజ్‌కుమార్‌ను ఔట్ చేసిన అతడు.. రెండో బంతికి శ్యామ్ సుందర్, మూడో బంతికి జగదీశన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాతి మూడు బంతుల్లోనూ పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి కొనసాగించాడు.
ఇదే మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు నమోదైంది. తిరుచ్చి జట్టులో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు తాము ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యారు. ఓపెనర్ రాజ్‌కుమార్, శ్యామ్ సుందర్, జగదీశన్, జాఫర్ జమాల్, అతిసాయరాజ్ డేవిడ్సన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. భారత టీ20 క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు గోల్డెన్ డక్‌గా ఔట్ కావడం ఇదే తొలిసారి.
తిరుచ్చి జట్టులో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. మరో ఐదుగురు బ్యాటర్లు కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. ఐదుగురు గోల్డెన్ డక్‌లలో ముగ్గురిని లింగేశ్ తన బౌలింగ్‌లోనే ఔట్ చేయడం విశేషం. పదునైన బౌలింగ్‌తో తిరుచ్చి పతనాన్ని శాసించిన లింగేశ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















