రవితేజ ప్రధానపాత్రలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన నాటి నుంచి మంచి స్పందనను సొంతం చేసుకున్న ఈ చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘ఇరుముడి’ని వీక్షించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
సినిమా విజయాన్ని అభినందిస్తూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక చిత్రం ఘన విజయం సాధించడం అంటే ఆ సినిమా బృందానికే కాకుండా మొత్తం చిత్ర పరిశ్రమకూ పండగేనని అన్నారు. ‘‘ఈ పరిశ్రమ అందరిది.. ఏ కొందరిదో కాదు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి’’ అని పేర్కొన్నారు.
రవితేజ నటనను చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసించారు. సినిమాను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా ఆస్వాదించానని, రవితేజ అద్భుతంగా నటించాడని కొనియాడారు. దర్శకుడు శివ నిర్వాణ కథను, భావోద్వేగాలను తెరపై చక్కగా ఆవిష్కరించారని ప్రశంసించారు.
బాలనటి నక్షత్రకు మంచి భవిష్యత్తు ఉండాలని చిరంజీవి ఆకాంక్షించారు. ‘ఇరుముడి’లో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ చిత్రం సాధించిన విజయం పూర్తిగా అర్హమైనదని పేర్కొన్నారు.
చిరంజీవి ప్రశంసలకు రవితేజ స్పందించారు. ‘‘అన్నయ్యా థాంక్యూ..’’ అంటూ హార్ట్ ఎమోజీలతో తన కృతజ్ఞతలు తెలిపారు. వీరిద్దరి మధ్య ఉన్న ఆత్మీయతకు సంబంధించిన ఈ స్పందన అభిమానులను ఆకట్టుకుంటోంది.
మరోవైపు ‘ఇరుముడి’కు థియేటర్లలో మంచి ఆదరణ కొనసాగుతోంది. విడుదలైన ఆరో రోజూ పలు ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. కొన్ని థియేటర్లలో ప్రదర్శిస్తున్న సినిమాను తొలగించి ‘ఇరుముడి’ వేయాలంటూ ప్రేక్షకులు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరికొన్ని ప్రాంతాల్లో సీట్లు సరిపోక అదనంగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొన్ని థియేటర్లలో ప్రేక్షకులు సినిమా ప్రదర్శన సమయంలో భజనలు చేస్తుండటం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ‘ఇరుముడి’ ప్రస్తుతం సినీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















