ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) నోయిడా, తెలంగాణలోని కార్పొరేట్ కార్యాలయాల్లో వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజినీర్లు, ఆఫీసర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లు, చీఫ్ మేనేజర్ తదితర పోస్టులను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా ఖాళీలు:
- కెమికల్: 18
- మెకానికల్: 3
- ఎలక్ట్రికల్: 3
- ట్రాన్స్‌పోర్టేషన్: 1
- హెచ్‌ఆర్: 2
- మెడికల్: 2
- ఫైనాన్స్ అండ్ అకౌంట్స్: 6
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 1
ఏ పోస్టులు?ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, ఆఫీసర్ సెక్రటేరియల్, అడిషనల్ సీఎంవో, సీఎంవో, అకౌంట్స్ ఆఫీసర్, చీఫ్ మేనేజర్ తదితర పోస్టులు ఉన్నాయి.
అర్హతలు:పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఎంబీబీఎస్, సీఏ, సీఎంఏ, పీజీతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి. పోస్టుల వారీగా విద్యార్హతలు, అనుభవ నిబంధనలు మారుతాయి.
వయసు పరిమితి :ఇంజినీర్, ఆఫీసర్ పోస్టులకు గరిష్ఠ వయసు 30 ఏళ్లు. అసిస్టెంట్, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 40 ఏళ్లు, అడిషనల్ సీఎంవో, సీఎంవో పోస్టులకు 45 ఏళ్లు, చీఫ్ మేనేజర్ పోస్టుకు 50 ఏళ్లు మించకూడదు.
జీతం ఎంత?
పోస్టును బట్టి నెలవారీ వేతన శ్రేణి ఇలా ఉంది:
- ఇంజినీర్: రూ.40,000–1,40,000
- అసిస్టెంట్ మేనేజర్: రూ.50,000–1,60,000
- డిప్యూటీ మేనేజర్: రూ.60,000–1,80,000
- అడిషనల్ సీఎంవో: రూ.70,000–2,00,000
- సీఎంవో: రూ.80,000–2,20,000
- చీఫ్ మేనేజర్: రూ.90,000–2,40,000
ఎంపిక విధానం :అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు వివరాలను నమోదు చేయాలి. అనంతరం దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని, అవసరమైన ధ్రువపత్రాలను జత చేసి పోస్టు ద్వారా ఆర్‌ఎఫ్‌సీఎల్ నోయిడా కార్పొరేట్ కార్యాలయానికి పంపించాలి.
ఫీజు :ఈ-1 నుంచి ఈ-4 స్థాయి పోస్టులకు రూ.700, ఈ-5, ఇతర పోస్టులకు రూ.1,000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24 సెప్టెంబర్ 2026
హార్డ్‌కాపీ చేరేందుకు చివరి తేదీ: 1 అక్టోబర్ 2026
దరఖాస్తులను డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్), రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్, నాలుగో అంతస్తు, క్రిభ్కో భవన్, సెక్టార్-1, నోయిడా, ఉత్తర్‌ప్రదేశ్–201301 చిరునామాకు పంపించాలి.అభ్యర్థులు పోస్టుల వారీగా అర్హతలు, అనుభవం, వయసు, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















