నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో కేంద్ర ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. సంస్థ పరిపాలనను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ఐదుగురు ఉన్నతాధికారులను వివిధ హోదాల్లో నియమించింది.
2005 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారి అన్షుమన్ శర్మను ఎన్‌టీఏ జాయింట్ సెక్రటరీగా నియమించారు. అలాగే ముగ్గురు అధికారులకు డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు.
2012 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేష్, 2012 బ్యాచ్ యూటీ కేడర్ ఐపీఎస్ అధికారి రవికుమార్ సింగ్, 2011 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి సాతియాలను డైరెక్టర్లుగా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
2016 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అమిత్ సమదారియాకు జాయింట్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. కొత్తగా నియమితులైన అధికారులు మూడు వారాల్లోగా తమ బాధ్యతలు స్వీకరించాలని కేంద్రం ఆదేశించింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవల్లో ఉన్న వి. ప్రసన్న వెంకటేష్ కేంద్ర ఉన్నత విద్యాశాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లనున్నారు. ఆయన్ను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.
ప్రసన్న వెంకటేష్ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఐదేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
గతంలో ఆయన విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్‌గా కూడా సేవలందించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















