టాక్సిక్’ చిత్రంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో నటి, మాజీ ఎంపీ సుమలత యశ్‌కు మద్దతుగా నిలిచారు. తాను ‘టాక్సిక్’ చిత్రాన్ని చూశానని, సినిమాలో యశ్ నటన తనను ఆకట్టుకుందని పేర్కొంటూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. సినిమా మేకింగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ.. యశ్ నటన మాత్రం అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
యశ్ ఎలాంటి భయాలకు వెనకాడకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ స్థాయికి చేరుకున్నారని సుమలత అన్నారు. ‘టాక్సిక్’ ఆయన కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. యశ్ ముందుచూపుతో, వివేకంతో ఆలోచించే వ్యక్తి అని.. ప్రస్తుతం కూడా అదే విధంగా ఆలోచించాలని సూచించారు.
చిత్రంపై వస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సుమలత పేర్కొన్నారు. ‘టాక్సిక్’ బహుశా ఇప్పుడు విడుదల కావాల్సిన సినిమా కాకపోవచ్చని, భవిష్యత్తులో విడుదలై ఉండాల్సిన చిత్రమేమోనని వ్యాఖ్యానించారు. యశ్ ఎదుగుదలను చూసి తట్టుకోలేని వారు, సినిమాను సరిగ్గా అర్థం చేసుకోలేని వారు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
‘‘మన విజయం పక్కవారికి అసూయగా ఉంటుంది’’ అంటూ యశ్‌కు ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో ‘కేజీఎఫ్’ను మించిన విజయాన్ని యశ్ అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. నటుడు రిషబ్ శెట్టి కూడా ఇటీవల ‘టాక్సిక్’పై స్పందించారు. ఈ చిత్రం సాహసోపేతమైన ప్రయోగమని పేర్కొంటూ యశ్ నటనను ప్రశంసించారు. యశ్‌కు తాను ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న యశ్ తపనను తాము ప్రేమిస్తున్నామని రిషబ్ శెట్టి పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















