దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్ జోన్ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతంగా రాణించాడు. నార్త్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 225 బంతుల్లో ఏడు ఫోర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి శ్రేయస్ గోపాల్ అద్భుత సహకారం అందించాడు. ఇద్దరూ ఆరో వికెట్‌కు 175 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో సౌత్ జోన్ పటిష్ఠ స్థితికి చేరుకుంది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 285/9తో నిలిచింది. తిలక్‌తో పాటు కావురి సాయితేజ (0) క్రీజులో ఉన్నాడు. ప్రత్యర్థిపై సౌత్ జోన్ ప్రస్తుతం 90 పరుగుల ఆధిక్యంలో ఉంది.
40/2తో సోమవారం ఆటను కొనసాగించిన సౌత్ జోన్‌ను నార్త్ బౌలర్ గుర్నూర్ బ్రార్ తీవ్రంగా దెబ్బతీశాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోలేక సౌత్ జోన్ 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తిలక్ వర్మ ఒత్తిడిని అధిగమిస్తూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
అనుభవజ్ఞుడైన శ్రేయస్ గోపాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరి భాగస్వామ్యంతో సౌత్ జోన్ 255/5కు చేరుకుంది. అయితే ఆ తర్వాత కేవలం 15 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోవడంతో భారీ ఆధిక్యం సాధించే అవకాశాన్ని సౌత్ జోన్ చేజార్చుకుంది. నార్త్ జోన్ తరఫున గుర్నూర్ బ్రార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కంబోజ్, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీశారు. హైదరాబాద్ ఆటగాళ్లు కొడిమెల హిమతేజ (0), తనయ్ త్యాగరాజన్ (6) నిరాశపరిచారు.
మరో సెమీఫైనల్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డుకు చేరువగా వెళ్లి చేజార్చుకున్నాడు. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడిన వైభవ్ 81 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. అయితే సెంచరీకి చేరువలో ఔటయ్యాడు.
వైభవ్ సెంచరీ పూర్తి చేసి ఉంటే భారత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో శతకం సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పేవాడు. ప్రస్తుతం ఈ రికార్డు ధ్రువ్ పండోవ్ పేరిట ఉంది. అతడు 14 ఏళ్ల 293 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. సచిన్ తెందుల్కర్ 15 ఏళ్ల 230 రోజుల వయసులో శతకం బాది ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. వైభవ్ 15 ఏళ్ల 157 రోజుల వయసులోనే సెంచరీ సాధించే అవకాశం కోల్పోయాడు.
వైభవ్, మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (69) కలిసి ఈస్ట్ జోన్‌కు అదిరే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 161 పరుగులు జోడించారు. అయితే వైభవ్ ఔటైన తర్వాత ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. హర్ష్ దూబె నాలుగు వికెట్లు, యశ్ ఠాకూర్, అర్యన్ పాండే చెరో మూడు వికెట్లు పడగొట్టడంతో ఈస్ట్ జోన్ 105 పరుగుల వ్యవధిలోనే మిగిలిన పది వికెట్లు కోల్పోయింది. చివరకు 266 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సెంట్రల్ జోన్ కూడా ఈస్ట్ జోన్ బౌలర్ల ధాటికి తడబడింది. ముకేశ్ కుమార్ రెండు వికెట్లు, మహ్మద్ షమి ఒక వికెట్ తీయడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ 45/3తో నిలిచింది. రజత్ పాటీదార్ మరోసారి విఫలమై ఐదు పరుగులకే వెనుదిరిగాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















