భూగర్భ గనుల నష్టాలకు చెక్ పెట్టేందుకు సింగరేణి సంస్థ కొత్త విధానంపై దృష్టి సారించింది. కేంద్ర బొగ్గు శాఖ సూచనల మేరకు భారీ నష్టాల్లో ఉన్న కొన్ని యూజీ గనులను ‘గని అభివృద్ధి, నిర్వహణ’ (ఎండీవో) విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తోంది.
ఈ విధానంలో ప్రైవేటు సంస్థలు తమ సొంత పెట్టుబడితో గనుల్లో బొగ్గును వెలికితీసి, ముందుగా నిర్ణయించిన ధరకు సింగరేణికి అందిస్తాయి. అనంతరం సింగరేణి ఆ బొగ్గును మార్కెట్‌లో విక్రయిస్తుంది. ఇతర జాతీయ బొగ్గు సంస్థల్లో ఈ విధానం ద్వారా నష్టాలను తగ్గించిన నేపథ్యంలో సింగరేణి కూడా అదే నమూనాను పరిశీలిస్తోంది.
ప్రయోగాత్మకంగా మందమర్రి ప్రాంతంలోని శాంతిఖని భూగర్భ గనిని ఎండీవో విధానంలో అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ కోరగా ఒక ప్రైవేటు సంస్థ స్పందించింది. దీంతో త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు సింగరేణి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సింగరేణి యూజీ గనుల్లో ఉత్పత్తి వ్యయం భారీగా ఉండటం సంస్థకు ప్రధాన సమస్యగా మారింది. 2025 చివరి నాటికి మొత్తం 22 భూగర్భ గనుల్లో 21 నష్టాల్లో ఉన్నట్లు కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ గనుల ద్వారా సంస్థకు వచ్చిన మొత్తం నష్టం రూ.1,924 కోట్లకు పైగా ఉన్నట్లు వెల్లడైంది.
ఆడ్రియాల భూగర్భ గని పరిస్థితి ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. అక్కడ టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.30,333 ఖర్చవుతుండగా, విక్రయ ధర కేవలం రూ.2,492గా ఉంది. దీంతో టన్నుకు రూ.27,841 వరకు నష్టం వస్తోంది. గత ఏడాది ఈ ఒక్క గనిలోనే రూ.302.87 కోట్ల నష్టం నమోదైంది.
ప్రస్తుతం సింగరేణి 21 భూగర్భ, 17 ఉపరితల గనులను నిర్వహిస్తోంది. ఉపరితల గనుల్లో భారీ యంత్రాలతో అధిక ఉత్పత్తి సాధ్యమవుతుండటంతో అక్కడ టన్ను బొగ్గు ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది. ఓసీ గనుల ద్వారా వచ్చే లాభాలతో యూజీ గనుల నష్టాలను భర్తీ చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

















