జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘వదలా’ మరో ఓటీటీ వేదికపైకి రానుంది. జులైలో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఆహా వేదికగా కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 3 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాలో యోగి సిద్ధార్థ్ (జగపతిబాబు) ఓ వైద్యుడిగా కనిపిస్తారు. ఆయన భార్య ప్రియ (లయ). ఇద్దరు పిల్లలతో కలిసి సిద్ధార్థ్ కుటుంబం ఎంతో అన్యోన్యంగా జీవిస్తుంటుంది. దాదాపు 20 ఏళ్లుగా ఎలాంటి పెద్ద సమస్యలు లేకుండా సాగుతున్న వారి జీవితంలోకి అముద (హృతిక శ్రీనివాస్) అనే యువతి అనుకోకుండా ప్రవేశిస్తుంది.
ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన అముదకు సిద్ధార్థ్ వైద్యం చేసి ప్రాణాలు కాపాడతాడు. దీంతో అతనిపై అముదకు ప్రత్యేకమైన అభిమానం, ఆరాధన ఏర్పడుతుంది. క్రమంగా ఆమె సిద్ధార్థ్ కుటుంబానికి దగ్గరవుతుంది. అయితే ఆ పరిచయం అక్కడితో ఆగకుండా.. సిద్ధార్థ్‌ను తన సొంతం చేసుకోవాలనే కోరికగా మారుతుంది.
సిద్ధార్థ్ తనకు దక్కాలంటే ఆయన భార్య ప్రియను దూరం చేయాలని అముద భావిస్తుంది. ఇందుకోసం ఓ పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తుంది. గుర్తు తెలియని నంబర్ల నుంచి సిద్ధార్థ్, ప్రియలకు ఫోన్ కాల్స్, సందేశాలు పంపుతూ వారిని మానసికంగా వేధించడం మొదలుపెడుతుంది. ఈ పరిణామాలతో ఆ కుటుంబంలో అనుమానాలు, భయాందోళనలు మొదలవుతాయి.
అసలు ఈ వేధింపుల వెనుక ఎవరు ఉన్నారు? అముద వేసిన పన్నాగం నుంచి సిద్ధార్థ్ కుటుంబం ఎలా బయటపడింది? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















