1998లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి ‘బావగారూ.. బాగున్నారా’ అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంభ కథానాయికగా నటించగా.. రచన, శ్రీహరి, కోట శ్రీనివాసరావు, పరేశ్ రావల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. కథ, కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో పాటు చిరంజీవి శైలి మాస్ అంశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అయితే ఈ చిత్రానికి ‘బావగారూ.. బాగున్నారా’ అనే టైటిల్ వెంటనే ఖరారు కాలేదట. కథకు తగ్గ పేరు కోసం చిత్రబృందం ఏకంగా 96 టైటిళ్లను సిద్ధం చేసిందని దర్శకుడి బృందంలో పనిచేసిన వీఎన్ ఆదిత్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆ సమయంలో జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమించుకుందాం రా’ మంచి విజయాన్ని సాధించడంతో.. టైటిల్ చివర్లో ‘రా’ ఉండాలనే సెంటిమెంట్ కూడా చిత్రబృందంలో చర్చకు వచ్చిందట. అయితే దర్శకుడు జయంత్‌కు అలాంటి సెంటిమెంట్లపై ప్రత్యేక పట్టింపు లేదని ఆదిత్య తెలిపారు.
చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్లుగా సాధారణ మాస్ టైటిల్ పెట్టడం కంటే.. కథ, పాత్రలు, సినిమా వాతావరణానికి సరిపోయేలా కాస్త క్లాస్‌గా, వైవిధ్యంగా ఉండే పేరు పెట్టాలని భావించారట. అందుకే 96 పేర్లను రాసి ఒక ఫైల్‌గా సిద్ధం చేశారట.
ఒకరోజు చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి టైటిల్‌పై తుది నిర్ణయం తీసుకునేందుకు ఆఫీసుకు రావాలని చెప్పారట. అక్కడికి వెళ్లేసరికి చిరంజీవి, జయంత్, నాగబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు కూర్చుని ఉన్నారని వీఎన్ ఆదిత్య గుర్తుచేసుకున్నారు.
అప్పుడు 96 టైటిళ్ల ఫైల్ తీసుకుని గదిలోకి వెళ్లే ముందు మొదటి టైటిల్‌గా ‘బావగారూ.. బాగున్నారా’ అని రాసి, పక్కన చిరంజీవి నటించిన ‘మాస్టర్’లోని ఓ పాటను గుర్తుచేసేలా బ్రాకెట్‌లో వివరించారట. ఆ పేరు చూసిన వెంటనే ‘ఇదేం టైటిల్?’ అంటూ ఆశ్చర్యపోయారని చెప్పారు.
అయితే కథలోని ఓ కీలక సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పేరు ఎందుకు సరిపోతుందో ఆయన వివరించారట. కథానాయిక స్వప్న తాను ప్రేమించిన వ్యక్తి రాజు తన అక్క భర్త అని తెలుసుకునే సన్నివేశం కథలో కీలక మలుపుగా ఉంటుంది. ఈ సన్నివేశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఇంటర్వెల్ ముందు ఓ ప్రత్యేక బీట్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనను ఆదిత్య సూచించారట.
స్వప్న రాజును గుడిలో కలిసినప్పుడు.. ఆమెను చూసిన రాజు కంగారుపడతాడు. అదే సమయంలో స్వప్న అనూహ్యంగా ‘బావగారూ.. బాగున్నారా’ అని పలకడం, వెంటనే రాజు ముఖంపై ఇంటర్వెల్ కార్డు పడేలా సన్నివేశాన్ని రూపొందించాలని సూచించారట.
ఈ ఆలోచనను అభిమానిలా చెప్పినప్పుడు చిరంజీవి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అందరినీ నవ్వించిందని వీఎన్ ఆదిత్య తెలిపారు. ఆ సన్నివేశం, టైటిల్ అందరికీ నచ్చడంతో పెద్దగా ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి ‘బావగారూ.. బాగున్నారా’ పేరును అధికారికంగా ప్రకటించారట.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















