పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం పడుతోంది. ముడిచమురు ధరలు పెరుగుతుండగా.. మరోవైపు విలువైన లోహాలైన బంగారం, వెండిపై డిమాండ్ తగ్గుతోంది. దీంతో దేశీయ మార్కెట్లలో పుత్తడి, వెండి ధరలు దిగొచ్చాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.55 లక్షలకు చేరింది. అంతకుముందు రోజు రూ.1.57 లక్షలుగా ఉన్న ధరతో పోలిస్తే సుమారు రూ.2 వేల మేర తగ్గింది. వెండి ధర కూడా గణనీయంగా పడిపోయింది. కిలో వెండి రూ.2,37,486 నుంచి రూ.2,34,478కు తగ్గింది. అంటే కిలోకు దాదాపు రూ.3 వేల మేర ధర తగ్గింది.
అంతర్జాతీయ, ఫ్యూచర్స్ మార్కెట్లలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. గోల్డ్ ఫ్యూచర్స్‌లో 10 గ్రాముల బంగారం రూ.1,50,143 వద్ద ట్రేడవుతుండగా.. సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ.2,32,625గా ఉంది. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,307 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ 63.79 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
సాధారణంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌లో బంగారానికి డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పైకి కదులుతుంటాయి. అంతేకాకుండా మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పుడు మదుపర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణిస్తారు. అయితే ప్రస్తుత పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ఈసారి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకునే పరిణామాలు, డాలర్ కదలికలు, ముడిచమురు ధరలు, పెట్టుబడిదారుల ధోరణి వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయితే మార్కెట్లలో అస్థిరత కొనసాగే అవకాశం ఉంది. దీంతో రానున్న రోజుల్లో పుత్తడి, వెండి ధరల కదలికలపై మదుపర్లు, కొనుగోలుదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















