దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమై ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరగడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య హర్మూజ్ జలసంధిపై నెలకొన్న ఉద్రిక్తతలు మదుపరుల్లో ఆందోళన పెంచడంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.
ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 703 పాయింట్లు నష్టపోయి 76,262 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 232 పాయింట్లు కోల్పోయి 23,823 వద్ద కదలాడుతోంది. కీలక సూచీలు భారీగా దిగజారడంతో పలు రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి.
నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, లార్సెన్ వంటి షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, ఎంఅండ్‌ఎం తదితర షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
నెలరోజుల విరామం తర్వాత పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణలు తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ఆందోళన నెలకొంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ముడిచమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి.
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 95.52 డాలర్ల వద్ద ఉండగా.. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు మరింత పెరిగితే దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన మదుపరుల్లో నెలకొంది.
మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.97 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై నెలకొన్న అనిశ్చితి రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
పశ్చిమాసియా పరిణామాలు మరింత ముదిరితే చమురు సరఫరా, ద్రవ్యోల్బణం, దిగుమతి వ్యయాలు, కంపెనీల లాభదాయకత వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో సమీప కాలంలో మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశముందని మదుపరులు అంచనా వేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















