దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ముఖ్యంగా దేవరకద్రలో ఏర్పాటు చేయనున్న డీఆర్‌డీఎల్ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని ఉచితంగా కేటాయించాలని రక్షణమంత్రిని సీఎం కోరారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026కు రాజ్‌నాథ్‌సింగ్‌ను రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. గ్లోబల్ సమ్మిట్‌లో నిర్వహించనున్న రక్షణ ఎక్స్‌పోలో కేంద్ర రక్షణశాఖ భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రక్షణ రంగానికి సంబంధించిన పెట్టుబడులు, పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం లభించేలా కేంద్ర సహకారం అందించాలని కోరారు.
అదే సమయంలో ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన అంశాన్ని కూడా సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. విమానాశ్రయం కోసం ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ చేపట్టినట్లు తెలిపారు. అవసరమైతే మరో 750 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు.
రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సహకరించాలని సీఎం కోరినట్లు తెలుస్తోంది. సమావేశంలో మంత్రి వివేక్, ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, అనిల్ యాదవ్ తదితరులు సీఎం వెంట ఉన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















