ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు అభిమానులు, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ సతీమణి అన్నా కొణిదెల చేసిన ప్రత్యేక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
పవన్‌తో కలిసి దిగిన ఓ క్యూట్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న అన్నా.. ఆయనకు ప్రేమపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈరోజు మీ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు ఎంతోమంది హృదయాల్లో, వారి ఆలోచనల్లో, వారి ప్రార్థనల్లో ఉన్నారు. ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపారు’’ అని పేర్కొన్నారు.
పవన్ ఎన్నో మందికి చేసిన సహాయాన్ని ప్రస్తావిస్తూ.. ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానమే అందుకు నిదర్శనమని అన్నా తెలిపారు. ‘‘వాళ్లకు ఎంతో సాయం చేశారనడానికి వారి గుండెల్లో మీ స్థానమే నిదర్శనం. హ్యాపీ బర్త్‌డే’’ అంటూ ప్రేమతో విషెస్ చెప్పారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు పెద్ద సంఖ్యలో కామెంట్లు చేస్తూ పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మరోవైపు పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని గ్రీన్ బోర్డ్ ఛైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. పవన్ పేరిట మారేడు మొక్కను నాటారు. మారేడు దళాలు పరమశివుడికి ఎంతో ఇష్టమైనవని పేర్కొన్న నాగబాబు.. సనాతన ధర్మాన్ని ఇష్టపడే పవన్‌కు ఇదే తన ప్రత్యేక కానుక అని తెలిపారు.
పుట్టినరోజు సందర్భంగా తాను మొత్తం 20 మొక్కలు నాటినట్లు నాగబాబు వెల్లడించారు. పవన్ కల్యాణ్ అభిమానులు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు.
పవన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కూడా పలు సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో ఆయన జన్మదిన వేడుకలు రాజకీయ, సినీ సందడి మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాల రూపంలోనూ కొనసాగుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















