ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియ మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఐదుగురు సభ్యులతో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) నిర్ణయాన్ని ఆయన తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు.
జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT)లో బుధవారం జరిగిన విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది సస్మిత్ పాత్రా వాదనలు వినిపించారు. వ్యక్తిగత దివాలా కేసులో విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు NCLTకి చట్టపరంగా ఏ అధికారం ఉందో స్పష్టం చేయాలని కోరారు.
సుభాష్ చంద్ర ఆస్తుల బదిలీపై NCLT ఐదుగురు సభ్యుల బెంచ్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అలాగే గ్రూపు రుణాలకు సంబంధించి వ్యక్తిగత హామీ కింద రుణదాతలు రూ.22,000 కోట్లకు పైగా క్లెయిమ్‌లు పేర్కొనగా.. రూ.6.5 కోట్ల చెల్లింపుతో దివాలా పరిష్కారానికి అనుమతించిన ఉత్తర్వుపైనా స్టే విధించింది.
ఈ నిర్ణయాలను సుభాష్ చంద్ర తరఫు న్యాయవాదులు NCLATలో ప్రశ్నించారు. డివిజన్ బెంచ్‌లోని సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే తదుపరి సభ్యుడికి కేసును కేటాయించే అవకాశం ఉందని, అయితే ఐదుగురు సభ్యులతో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయడానికి NCLTకి అధికారం లేదని వాదించారు.
మరోవైపు అసమ్మతి వ్యక్తం చేసిన క్రెడిటర్ల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసులో పరస్పర విభిన్న తీర్పులు వెలువడ్డాయని, మూడు భిన్న దృక్పథాలు ఉన్నందున విస్తృత ధర్మాసనం ద్వారా అంశాన్ని పరిశీలించడం సముచితమేనని పేర్కొన్నారు.
ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ యోగేష్ ఖన్నా నేతృత్వంలోని NCLAT ధర్మాసనం.. ఐదుగురు సభ్యుల బెంచ్ ఏర్పాటు సరైనదా? కాదా? అనే అంశాన్ని ప్రస్తుతం చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ అంశం NCLT వద్దే పెండింగ్‌లో ఉన్నందున అక్కడే అభ్యంతరాలను లేవనెత్తాలని సూచించింది.
కేసు తదుపరి విచారణను అక్టోబర్ 7కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, సుభాష్ చంద్ర రుణ పరిష్కార ప్రణాళికపై NCLT ఐదుగురు సభ్యుల ధర్మాసనం సెప్టెంబర్ 23న విచారణ చేపట్టనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















