మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ అధిష్ఠానం సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా రాష్ట్రానికి చెందిన పలువురు ముఖ్య నేతలు అధిష్ఠానంతో వరుసగా సమావేశం కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
సురేఖపై చర్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గట్టిగా పట్టుబట్టినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి కూడా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు చేయడంతో ఈ అంశం అధిష్ఠానం పరిశీలనకు వెళ్లింది.
మరోవైపు దిల్లీలో ఉన్న కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తన వాదనను వివరించినట్లు సమాచారం. తనపై పార్టీలో కుట్ర జరుగుతోందని పేర్కొంటూ ఆమె నివేదిక సమర్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు ఆమె ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులో లేకపోయినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై కూడా అధిష్ఠానం చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. సురేఖతో పాటు చిన్నారెడ్డిని ఆ పదవి నుంచి తొలగించేందుకు అంగీకారం లభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
బుధవారం దిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో తెలంగాణకు చెందిన నాయకుల వరుస భేటీలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలుత కేసీ వేణుగోపాల్‌ను, అనంతరం మల్లికార్జున ఖర్గేను కలిశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సైతం ఖర్గేతో భేటీ అయి తాజా పరిణామాలపై చర్చించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఖర్గేతో తన భేటీ మర్యాదపూర్వకమేనని స్పష్టం చేశారు. రాజకీయ అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. సురేఖపై చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు తనకు తెలియదని సమాధానమిచ్చారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















