సైబర్ నేరగాళ్లు మోసాలకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో పాటు ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలపై కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనలను సైతం మోసాలకు ఉపయోగిస్తున్నారు. ఈ ప్రకటనల ద్వారా హానికరమైన ఆండ్రాయిడ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయించి.. తర్వాత ఫోన్‌ను తమ నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు చెందిన నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ ఈ విషయంపై ఆగస్టు 26న అడ్వైజరీ జారీ చేసింది. ‘నైట్ ప్లే’, ‘రిలూప్’, ‘కైస్’, ‘విమో’, ‘రివో’, ‘నెక్సో’, ‘విక్సా’ తదితర పేర్లతో అనుమానాస్పద యాప్‌లు ప్రచారం అవుతున్నట్లు గుర్తించింది.
సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లేదా అడల్ట్ కంటెంట్‌కు సంబంధించిన ప్రకటన కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మరో వెబ్‌సైట్‌కు తీసుకెళ్లి.. వీడియో చూడాలంటే ప్రత్యేక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచిస్తారు. అక్కడే అసలు మోసం మొదలవుతుంది.
గూగుల్ ప్లే స్టోర్‌కు బదులుగా వెబ్‌సైట్ నుంచి APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయించి ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయిస్తారు. ఈ విధంగా అధికారిక యాప్ స్టోర్ భద్రతా తనిఖీలను తప్పించుకుని మాల్‌వేర్ ఫోన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
ఇలాంటి యాప్‌లు Accessibility Permission వంటి సున్నితమైన అనుమతులను కోరవచ్చు. వాటిని దుర్వినియోగం చేస్తే ఫోన్ స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని చదవడం, ఇతర యాప్‌లతో పరస్పరం పనిచేయడం, వినియోగదారు తరఫున కొన్ని చర్యలు చేయడం సాధ్యమవుతుంది.
దీంతో బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లలోని కార్యకలాపాలను పర్యవేక్షించడం, ఓటీపీ, పిన్ వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం, అనధికారిక లావాదేవీలకు పాల్పడటం వంటి ప్రమాదాలు ఉండొచ్చు.
మొదట ఇన్‌స్టాల్ చేసిన యాప్.. తర్వాత అప్‌డేట్ పేరుతో మరో హానికరమైన ప్యాకేజీని ఇన్‌స్టాల్ చేయించవచ్చు. కొన్ని వేరియంట్లు VPNను కూడా ఏర్పాటు చేయగలవని అధికారులు హెచ్చరించారు. మరికొన్ని మాల్‌వేర్ యాప్‌లను సాధారణ పద్ధతిలో తొలగించకుండా అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉండొచ్చని పేర్కొన్నారు.
ఫోన్‌లో మీకు తెలియని యాప్ కనిపించడం, మీ ప్రమేయం లేకుండానే స్క్రీన్‌పై ట్యాపింగ్ జరగడం, గుర్తుతెలియని VPN కనిపించడం, Accessibility సెట్టింగ్స్‌లో అనుమానాస్పద యాప్‌కు అనుమతి ఉండటం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.
యాప్ పనిచేయడానికి Accessibility Access వంటి అధిక స్థాయి అనుమతి తప్పనిసరిగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తే మరింత అప్రమత్తంగా ఉండాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















