ఏఐ, రోబోటిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ సంస్థలు ఆటోమేషన్ వైపు మళ్లే అవకాశం పెరుగుతోంది. కస్టమర్ సపోర్ట్, డేటా విశ్లేషణ, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, రుణాల అంచనా వంటి అనేక పనులను ఏఐ నిర్వహించగలిగే పరిస్థితి వస్తోంది. దీంతో ముఖ్యంగా ప్రారంభ స్థాయి, మధ్యస్థాయి ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిస్థితిలో ఏఐ ఒక పనిని చేయగలిగినా.. సమాజానికి అవసరమని భావించిన కొన్ని పనులను మనుషులకే పరిమితం చేయాలని గేట్స్ సూచించారు. వృద్ధుల సంరక్షణ, పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్య సేవలు వంటి రంగాల్లో మానవ అనుభూతి, విశ్వాసం, అనుబంధం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ఇది ఏఐని పూర్తిగా నిషేధించే విధానం కాదని గేట్స్ స్పష్టం చేస్తున్నారు. మనుషుల సామర్థ్యాన్ని పెంచే సాధనంగా ఏఐని ఉపయోగిస్తూనే.. మానవ స్పర్శ అవసరమైన ఉద్యోగాలను రక్షించడమే లక్ష్యం కావాలని సూచిస్తున్నారు.
ఉద్యోగులను నియమించుకున్నప్పుడు కంపెనీలకు కొన్ని రకాల పన్నుల భారం ఉంటుంది. కానీ అదే పనిని ఏఐ లేదా రోబోట్లతో చేయిస్తే ఆ వ్యయం తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో సంస్థలు వేగంగా ఆటోమేషన్ వైపు వెళ్లే ప్రమాదం ఉందని గేట్స్ పేర్కొన్నారు.
అందుకే ఏఐ వినియోగం, రోబోట్లపై పన్ను విధించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన సూచించారు. ఈ విధంగా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగాలు కోల్పోయే వారికి పునఃశిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రత వంటి కార్యక్రమాలకు వినియోగించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొనే కఠినమైన విధానాన్ని అమలు చేస్తే.. ప్రారంభ దశలో సుమారు 40 శాతం ఉద్యోగాలను ‘హ్యూమన్ రిజర్వ్డ్’గా ఉంచే అవకాశం ఉందని గేట్స్ వ్యాఖ్యానించారు. అయితే ఇది ఖరారైన విధాన లక్ష్యం కాదని, ఎంత శాతం ఉద్యోగాలను రిజర్వ్ చేయాలనేది నిర్ణయించడం చాలా క్లిష్టమైన అంశమని కూడా ఆయన పేర్కొన్నారు.
మొత్తంగా ఏఐని అడ్డుకోవడం కాకుండా.. సాంకేతిక పురోగతి, మానవ ఉపాధి మధ్య సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందన్నదే గేట్స్ ఆలోచన. భవిష్యత్తులో ఏ ఉద్యోగాలు పూర్తిగా మనుషులకే పరిమితం కావాలి? ఏ పనుల్లో ఏఐతో కలిసి పనిచేయాలి? అన్నదానిపై ప్రభుత్వాలు, సంస్థలు, సమాజం కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చన్న చర్చ మొదలైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















