ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కొనసాగించాలా? వద్దా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ అంశంపై ఇప్పటికే పది ఫ్రాంచైజీల కెప్టెన్ల అభిప్రాయాలను బీసీసీఐ తీసుకుంది. వచ్చే సీజన్‌లో ఈ నిబంధనను కొనసాగిస్తారా? లేక తొలగిస్తారా? అనేది బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంది.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన తొలగిస్తే ఎంఎస్ ధోని ఐపీఎల్ భవితవ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత సీజన్‌లో గాయం కారణంగా అతడు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. అయితే 2027 సీజన్‌లో ధోని తప్పకుండా బరిలోకి దిగుతాడని సీఎస్‌కే అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రినాథ్ ధోని అభిమానులకు కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ధోని వచ్చే ఐపీఎల్ సీజన్‌లో తప్పకుండా ఆడతాడని చెప్పాడు.
ధోని తనతో వ్యక్తిగతంగా మాట్లాడినట్లు బద్రినాథ్ వెల్లడించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాకుండా పూర్తిస్థాయి వికెట్ కీపర్‌గా ఆడతానని ధోని చెప్పినట్లు పేర్కొన్నాడు. అంటే 20 ఓవర్లూ మైదానంలో ఉండేలా ధోని సిద్ధమవుతున్నట్లు బద్రినాథ్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
అయితే ధోని శరీరం అంత సమయం సహకరిస్తుందా? అనే సందేహం కూడా ఉందని బద్రినాథ్ పేర్కొన్నాడు. గతంలో సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు గుర్తుచేశాడు. ధోని సాధారణంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆలస్యంగా వచ్చి పరిమిత పాత్ర పోషిస్తున్నాడని వివరించాడు.
శివమ్ దూబే బౌలింగ్ చేయడం భారత జట్టుకు ఉపయోగకరమే కానీ సీఎస్‌కేకు అంత అవసరం లేదని బద్రినాథ్ అభిప్రాయపడ్డాడు. దూబే విషయంలో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఉపయోగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.
అలాగే అకీల్ హుస్సేన్‌ను సీఎస్‌కే తప్పకుండా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంచాలని సూచించాడు. అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించడం వల్ల కొన్ని సందర్భాల్లో అతడి సేవలను కోల్పోయిన పరిస్థితులు కనిపించాయని చెప్పాడు.
ఇంపాక్ట్ రూల్‌ను తప్పుబట్టాల్సిన అవసరం లేదని.. ఆ నిబంధనను సరైన వ్యూహంతో ఎలా ఉపయోగించుకోవాలనేది ఆయా జట్లపై ఆధారపడి ఉంటుందని బద్రినాథ్ పేర్కొన్నాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















