పాత కంప్యూటర్ పనితీరు మందగించిందా? స్టోరేజీ తక్కువగా ఉండటంతో కొత్త సాఫ్ట్‌వేర్‌లు, ఏఐ టూల్స్‌ను వినియోగించలేకపోతున్నారా? అలాంటి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రిలయన్స్ జియో తన JioPC క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మాత్రమే పరిమితమైన ఈ సేవలు ఇక ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఇతర వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటాయి.
JioPC ద్వారా పాత తరం కంప్యూటర్ల హార్డ్‌వేర్‌ను మార్చకుండానే మెరుగైన కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పొందవచ్చని జియో చెబుతోంది. ఎంపిక చేసుకున్న ప్లాన్‌ను బట్టి 8జీబీ ర్యామ్, 500జీబీ స్టోరేజీ నుంచి 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజీ వరకు క్లౌడ్ కంప్యూటింగ్ వనరులను వినియోగించుకోవచ్చు.
సాధారణంగా పాత కంప్యూటర్లలో ర్యామ్, స్టోరేజీ, ప్రాసెసర్ సామర్థ్యం పరిమితంగా ఉండటంతో కొత్త అప్లికేషన్లు, భారీ సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగించడం కష్టంగా ఉంటుంది. JioPCలో మాత్రం ప్రాసెసింగ్ భారాన్ని వినియోగదారుడి కంప్యూటర్‌పై కాకుండా జియో క్లౌడ్ సర్వర్లపై నిర్వహిస్తారు. దీంతో తక్కువ సామర్థ్యం ఉన్న కంప్యూటర్‌లోనూ క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్‌ను ఉపయోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది.
JioPCను వినియోగించేందుకు ప్రత్యేకంగా కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదని జియో తెలిపింది. సుమారు ఐదు నిమిషాల్లోనే సెటప్ పూర్తి చేసి సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఎనిమిదేళ్ల వరకు పాత కంప్యూటర్లకు సైతం ఆధునిక కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందించవచ్చని వెల్లడించింది.
జియో ప్రస్తుతం JioPC, JioPC Ultra అనే రెండు వేరియంట్లను అందిస్తోంది. JioPCలో 8జీబీ ర్యామ్, 500జీబీ స్టోరేజీ లభిస్తుంది. దీని ధర 2 నెలలకు రూ.1,000, 5 నెలలకు రూ.2,000, 10+2 నెలల ప్లాన్‌కు రూ.4,000గా ఉంది.
ఇక JioPC Ultraలో 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజీ లభిస్తుంది. దీని ధర 2 నెలలకు రూ.1,200, 5 నెలలకు రూ.2,500, 10+2 నెలలకు రూ.5,000గా నిర్ణయించారు.
JioPC క్లౌడ్ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. వినియోగదారులు బ్రాడ్‌బ్యాండ్ లేదా 4జీ/5జీ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని జియో తెలిపింది. ముఖ్యంగా పాత కంప్యూటర్లను వెంటనే మార్చకుండా వాటినే కొనసాగించాలనుకునే వినియోగదారులకు ఈ సేవ ఉపయోగపడే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















