గాంధారి’ కథాంశం మొదట్లోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. రైల్వే స్టేషన్‌లో చిన్నారి కిడ్నాప్ కావడం, ఆమెను వెంబడించే క్రమంలో తల్లి కంటిచూపు కోల్పోవడం వంటి సన్నివేశాలు కథపై అంచనాలు పెంచుతాయి. తనకు పరిచయం లేని నగరంలోనే ఉంటూ కూతురి కోసం తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే ఈ పాయింట్లను దర్శకుడు మరింత ఉత్కంఠభరితంగా మలచడంలో పూర్తిగా సఫలం కాలేదు.
జాయ్‌పురలోని రహస్య ప్రపంచాన్ని పరిచయం చేయడంపై పెట్టిన శ్రద్ధ, ప్రధాన కథపై పెట్టి ఉంటే సినిమా మరింత బిగువుగా ఉండేది. కొన్ని పాత్రల నేపథ్యాలు, పట్టణంలోని మిస్టరీ అంశాలు కథకు ఉపయోగపడాల్సింది పోయి.. అసలు కథన వేగాన్నే తగ్గిస్తాయి. ముఖ్యంగా చిన్నారి కోసం తల్లిదండ్రులు చేస్తున్న అన్వేషణ కంటే ఇతర అంశాలు తెరపై ఎక్కువగా కనిపించడంతో భావోద్వేగ ప్రభావం కూడా తగ్గుతుంది.
కిడ్నాప్ వెనుక ఉన్న ముఠా, వారి కార్యకలాపాలు, పోలీసుల దర్యాప్తు వంటి అంశాలు ప్రేక్షకులకు కొత్తగా అనిపించవు. ఇలాంటి కథాంశాలతో ఇప్పటికే పలు సినిమాలు రావడంతో, ‘గాంధారి’ ప్రత్యేకతను చూపించాలంటే కథనంలో బలమైన మలుపులు, ఊహించని ట్విస్టులు అవసరం. కానీ అవి ఆశించిన స్థాయిలో పండలేదు. కొన్ని సన్నివేశాలు ముందే ఊహించేలా ఉండటంతో థ్రిల్ తగ్గిపోతుంది.
క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు కూడా కథకు సహజమైన ముగింపులా కాకుండా.. కమర్షియల్ టచ్ కోసం జోడించినట్లుగా అనిపిస్తాయి. దాంతో సినిమా మొదట్లో ఏర్పడిన మిస్టరీ వాతావరణం చివరి వరకు కొనసాగదు.
కథనం విషయంలో కొన్ని లోపాలున్నప్పటికీ తాప్సి తన పాత్రకు న్యాయం చేసింది. కూతురిని కోల్పోయిన తల్లిగా ఆమె పలికించే భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కంటిచూపు కోల్పోయిన తర్వాత కుమార్తెను వెతికే సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ తాప్సి మెప్పించింది.
ఇష్వాక్ సింగ్ తన పాత్ర పరిధిలో సహజంగా నటించాడు. పోలీస్ అధికారిగా జతిన్ శర్మ, ప్రతినాయకుడిగా ప్రశాంత్ నారాయణన్ తమ పాత్రలకు తగ్గట్లుగా కనిపించారు. స్వస్తికా ముఖర్జీ సహా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
చైల్డ్ ట్రాఫికింగ్ వంటి తీవ్రమైన అంశాన్ని మిస్టరీ థ్రిల్లర్‌గా చెప్పాలనే ప్రయత్నం ఆసక్తికరంగా ఉన్నా.. బలమైన కథనం లేకపోవడంతో ‘గాంధారి’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోదు. తాప్సి నటన, ప్రారంభ సన్నివేశాలు, కొన్ని యాక్షన్ సీన్లు మినహా చెప్పుకోదగ్గ ప్రత్యేకతలు తక్కువే. మిస్టరీ థ్రిల్లర్ అభిమానులు ఓటీటీలో ఒకసారి ప్రయత్నించొచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















